ఆసియా కప్ (Asia Cup) 2025లో టీమిండియా (Team India) వరుస విజయాలతో దూసుకుపోతోంది. సూపర్-4లో భాగంగా భారత్–బంగ్లాదేశ్ (India-Bangladesh) మధ్య జరిగిన మ్యాచ్‌లో టీమిండియా ఘన విజయం సాధించింది. ఈ విజయంతో నేరుగా ఫైనల్(Final)కు అర్హత సాధించింది. ముందుగా బ్యాటింగ్ చేసిన భారత జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 168 పరుగులు చేసింది. టాప్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్ మెరుగైన ఇన్నింగ్స్ ఆడగా, బంగ్లాదేశ్ బౌలర్లు ఒత్తిడి తెచ్చినా భారత్ మంచి స్కోరు చేసింది.
169 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన బంగ్లాదేశ్ జట్టు (Bangladesh Team) భారత బౌలర్ల ముందు తడబడింది. వరుసగా వికెట్లు కోల్పోయిన బంగ్లా జట్టు 19.3 ఓవర్లలో 127 పరుగులకే ఆలౌట్ అయింది. ఈ విజయం భారత జట్టుకు ఫైనల్ టికెట్ అందించింది. మరోవైపు రెండో జట్టు కోసం పోటీ ఇంకా కొనసాగుతుండగా, ఆసియా కప్ గ్రాండ్ ఫైనల్ కోసం క్రికెట్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.








