టీ20 ప్లేయర్ ఆఫ్ ది ఇయర్’ అవార్డు అర్ష్‌దీప్ సింగ్ కు

టీ20 ప్లేయర్ ఆఫ్ ది ఇయర్’ అవార్డు అర్ష్‌దీప్ సింగ్ కు

భారత క్రికెట్‌లో యువ పేసర్ అర్ష్‌దీప్ సింగ్ (Arshdeep Singh) తన టీ20 అంతర్జాతీయ కెరీర్‌తో ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నాడు. తక్కువ సమయంలోనే అర్ష్‌దీప్ సాధించిన విజయాలు, సృష్టించిన రికార్డులు అతని ప్రతిభకు అద్దం పడుతున్నాయి. ముఖ్యంగా కీలక మ్యాచ్‌లలో ఒత్తిడిని తట్టుకుని వికెట్లు పడగొట్టే సామర్థ్యం అతడిని టీమిండియా ప్రధాన బౌలర్‌గా నిలబెట్టింది. అర్ష్‌దీప్ టీ20 కెరీర్‌లో ఎన్నో మైలురాళ్లు అందుకున్నాడు. అవేంటో ఓసారి చూద్దాం.

అర్ష్‌దీప్ సింగ్ ఇప్పటికే టీ20 వరల్డ్ కప్ (T20 World Cup) విజేతగా నిలిచాడు. అంతేకాదు టీ20 వరల్డ్‌ కప్‌లలో భారత్ తరఫున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా రికార్డు సృష్టించాడు. అతని స్థిరమైన ప్రదర్శనకు గుర్తింపుగా ‘ఐసీసీ టీ20 ప్లేయర్ ఆఫ్ ది ఇయర్’ అవార్డును కూడా అందుకున్నాడు. మరో విశేషం ఏమిటంటే.. పురుషుల టీ20 అంతర్జాతీయ క్రికెట్‌లో భారత్ తరఫున 100 వికెట్లు (100 Wickets) తీసిన తొలి బౌలర్‌గా అర్ష్‌దీప్ చరిత్ర సృష్టించాడు. అదేవిధంగా భారత్ తరఫున టీ20ల్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా కూడా నిలిచాడు.

2022, 2024 టీ20 వరల్డ్‌ కప్‌లలో భారత జట్టు తరఫున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా అర్ష్‌దీప్ సింగ్ పేరు రికార్డుల్లో నిలిచింది. అర్ష్‌దీప్ కెరీర్ ప్రారంభ దశలో ఉన్నప్పటికీ.. ఇప్పటికే అతడు సాధించిన విజయాలు అసాధారణంగా ఉన్నాయి. ఇలాంటి ప్రదర్శన కొనసాగితే భవిష్యత్తులో భారత టీ20 బౌలింగ్ విభాగానికి అతడు మూల స్తంభంగా మారడం ఖాయం. టీ20లో ఇప్పటికే ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రా కంటే మంచి గణాంకాలతో ముందున్నాడు. అర్ష్‌దీప్ ఇప్పటివరకు 81 టీ20ల్లో 126 వికెట్స్ పడగొట్టాడు. అత్యుత్తమ గణాంకాలు 5/51 కావడం విశేషం.

Join WhatsApp

Join Now

Leave a Comment