ప్ర‌పంచ రికార్డ్ సాధించిన గిరిజన విద్యార్థులు

ప్ర‌పంచ రికార్డ్ సాధించిన గిరిజన విద్యార్థులు

ప్రపంచ ఆరోగ్య దినోత్సవాన్ని (World Health Day) పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్‌ (Andhra Pradesh) లోని అల్లూరి జిల్లాలో గిరిజన విద్యార్థులు (Tribal Students) చరిత్రను సృష్టించారు. అరకులోయ ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో జరిగిన ఈ కార్యక్రమంలో, ఒకేసారి 21,850 మంది గిరిజన బాలబాలికలు 108 సూర్య నమస్కార ఆసనాలు నిర్వహించి ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచారు.

ఈ వినూత్న కార్యక్రమాన్ని లండన్ నుండి వచ్చిన ప్రపంచ రికార్డు యూనియన్ మేనేజర్ అలిస్ రేనాడ్ (Alice Renaud) స్వయంగా వీక్షించి, దీనిని ప్రపంచ రికార్డు (World Record) గా గుర్తించారు. అనంతరం ఆ ధ్రువీకరణ పత్రాన్ని జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్‌ (Dinesh Kumar) కి అందజేశారు. ఈ ఘనత ద్వారా గిరిజన విద్యార్థుల ప్రతిభను ప్రపంచం దృష్టికి తీసుకెళ్లారు. ఇది కేవలం ఆరోగ్య దినోత్సవం కార్యక్రమమే కాకుండా, వారి సాంస్కృతిక స్థాయిని, క్రమశిక్షణను, శారీరక సామర్థ్యాన్ని చాటిచెప్పే మైలురాయిగా నిలిచింది.

Join WhatsApp

Join Now

Leave a Comment