అరకులో ఉద్రిక్తత.. మెడ‌కు ఉరి తాళ్ల‌తో గిరిజనుల ఆందోళన

అరకులో ఉద్రిక్తత.. మెడ‌కు ఉరి తాళ్ల‌తో గిరిజనుల ఆందోళన

అరకు (Araku) ప్రాంతంలో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మేఘాలకొండ (Meghalakonda) వ్యూ పాయింట్ (View Point) వద్ద ఎకో టూరిజం  (AP Tourism) పేరుతో అటవీశాఖ చేపడుతున్న చర్యలపై స్థానిక గిరిజనులు (Tribals) ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ జీవనాధారాన్ని దెబ్బతీసే ఈ ప్రాజెక్టును వెంటనే నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ, మెడకు ఉరి తాళ్లు వేసుకుని నిరసన ప్రదర్శన చేశారు.

మా బతుకులు కాపాడండి..
గిరిజనులు మాట్లాడుతూ.. “మేఘాలకొండ ప్రాంతం మా ఆవాసం, మా జీవనాధారం. ఇక్కడకు వచ్చే పర్యాటకులపై ఆధారపడి 600 కుటుంబాలు జీవిస్తున్నాయి. ఇప్పుడు అభివృద్ధి పేరుతో మమ్మల్ని తరిమేయాలనుకోవడం అన్యాయం” అని మండిపడ్డారు. ఎకో టూరిజం పేరుతో అటవీశాఖ తమ పొట్ట కొట్టే ప్రయత్నం చేస్తోందని వారు ఆరోపించారు.

గిరిజనులకే అవకాశాలు కావాలి
గిరిజన నాయకులు పేర్కొంటూ.. “మా నేల, మా అటవీ, మా జీవనం – ఇవన్నీ మాకు తిరిగి ఇవ్వండి. అభివృద్ధి పేరుతో మమ్మల్ని నాశనం చేయొద్దు. ఈ ప్రాంతంలోని పర్యాటక ప్రాజెక్టుల్లో గిరిజనులకే ప్రాధాన్యం ఇవ్వాలి” అని డిమాండ్ చేశారు. అధికారులు తక్షణం స్పందించి తమ సమస్యలు పరిష్కరించకపోతే ఉద్యమాన్ని ముమ్మరం చేస్తామని హెచ్చరించారు.

Join WhatsApp

Join Now

Leave a Comment