ఐపీఎల్ తరహాలో ఆసక్తిగా ఏపీఎల్ 2025 వేలం: పైలా అవినాష్‌కు భారీ ధర!

ఐపీఎల్ తరహాలో ఆసక్తిగా ఏపీఎల్ 2025 వేలం: పైలా అవినాష్‌కు భారీ ధర!

ఆంధ్ర ప్రీమియర్ లీగ్ (ఏపీఎల్)(APL) 2025 వేలం ప్రక్రియ విశాఖపట్నం (Visakhapatnam )లోని రాడిసన్ బ్లూ హోటల్‌ (Radisson Blu Hotel)లో ఉత్సాహంగా కొనసాగుతోంది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) తరహాలో జరుగుతున్న ఈ ప్లేయర్స్ ఆక్షన్ కోసం మొత్తం 520 మంది క్రికెటర్లు తమ పేర్లను నమోదు చేసుకోగా, ఏడు జట్ల యాజమాన్యాలు తమకు కావాల్సిన ఆటగాళ్ల కోసం పోటీ పడుతున్నాయి.

ఏపీఎల్ 2025 వేలంలో ఇప్పటివరకు పైలా అవినాష్‌ (Paila Avinash)కు భారీ ధర లభించింది. అతడిని రూ.11.5 లక్షలకు రాయల్స్ ఆఫ్ రాయలసీమ జట్టు సొంతం చేసుకుంది. మరోవైపు, పీవీ సత్యనారాయణ రాజును రూ.9.8 లక్షలకు భీమవరం బుల్స్ కైవసం చేసుకుంది. ఆల్‌రౌండర్‌ల కోసం ఫ్రాంచైజీలు తీవ్రంగా పోటీ పడుతుండటంతో, వారికి జాక్‌పాట్ తగులుతోంది.

ఇప్పటివరకు అమ్ముడైన ఇతర ప్రముఖ ఆటగాళ్ళు:

పి. గిరినాథ్ రెడ్డిని రూ.10.05 లక్షలకు రాయలసీమ రాయల్స్

త్రిపురాన విజయ్‌ను రూ.7.55 లక్షలకు సింహాద్రి వైజాగ్ లయన్స్

సౌరభ్ కుమార్‌ను రూ.8.80 లక్షలకు తుంగభద్ర వారియర్స్

యర్రా పృథ్వీ రాజ్‌ను రూ.8.05 లక్షలకు విజయవాడ సన్ షైనర్స్ టీమ్ దక్కించుకున్నాయి

Join WhatsApp

Join Now

Leave a Comment