ఏపీలో వింత వాతావరణ పరిస్థితులు.. ఎందుకిలా..?

ఏపీలో వింత వాతావరణ పరిస్థితులు.. ఎందుకిలా..?

ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో వింత వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయి. ఒకవైపు చలి వణికిస్తుండ‌గా, మరోవైపు అల్పపీడనం దూసుకొస్తుంది. ఈ ప్రభావం రాష్ట్ర వ్యాప్తంగా తీవ్రత చూపుతోంది. వాతావరణ శాఖ అధికారులు ప్రజలను అప్రమత్తం చేస్తూ వర్షాలు, చలి, మరియు అల్పపీడనం కారణంగా జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు.

ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి
ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లోని కొన్ని ప్రాంతాలలో ఉష్ణోగ్రతలు సింగిల్ డిజిట్‌కు పడిపోయాయి. ముఖ్యంగా పాడేరు, అరకు ప్రాంతాల్లో ఉష్ణోగ్రత 10 డిగ్రీల మేరకు తగ్గింది. మినుములూరులో 8 డిగ్రీలు, చింతపల్లిలో 12.3 డిగ్రీలు నమోదయ్యాయి. ఈ చలిలో గిరిజనులు తీవ్ర అవస్థలు పడుతున్నారు.

అల్పపీడనం ప్రభావం.. భారీ వర్షాలు, పొగమంచు
తాజాగా ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఈ అల్పపీడనం తమిళనాడు తీరం వైపు కదిలే అవకాశం ఉంది. గతంలో పలు ప్రాంతాల్లో వర్షాలు కురిసిన సంగతి తెలిసిందే.

విమాన రాకపోకలపై ప్రభావం..
విశాఖ ఎయిర్ పోర్టుల్లో పోగమంచు ప్రభావం తీవ్రంగా ఉంది. దాంతో పాటు విమానాల రాకపోకలపై తీవ్ర ప్రభావం పడింది. శనివారం ఉదయం ఇండిగో, ఎయిర్ ఇండియా విమానాలు ఆలస్యమయ్యాయి. అదే విధంగా బెంగుళూరు, హైదరాబాద్, చెన్నై, ఢిల్లీ నుంచి విశాఖకి వచ్చే విమానాలు కూడా ఆలస్యమయ్యాయి.

Join WhatsApp

Join Now

Leave a Comment