కూటమి ప్రభుత్వ నిర్ణయంపై గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు తీవ్రంగా మండిపడుతున్నారు. చట్టానికి లోబడి ఐక్య కార్యచరణ రూపొందిస్తామని ప్రకటించింది. అసలు ఏం జరిగిందంటే.. గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థలో మార్పులు చేయాలని తాజాగా సీఎం చంద్రబాబు నాయుడు నిర్ణయించారు. సచివాలయ ఉద్యోగులను రెండు రకాలుగా విభజించాలని, 2500 ఇళ్లకో సచివాలయం ఉండేలా చూడటం వంటి అంశాలున్నట్లుగా తెలుస్తోంది. అయితే దీనిపై మంత్రిమండలి సమావేశంలో ఎలాంటి నిర్ణయం జరగలేదు. జాయింట్ స్టాఫ్ కౌన్సిల్‌లోనూ చర్చించలేదు. కానీ ప్రభుత్వం మాత్రం ప్రక్షాళన చేసేందుకు సిద్దమైపోయింది.
దీనిపై సచివాలయ ఉద్యోగుల్లో ఆందోళన మొదలైంది. గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థలో ప్రక్షాళనకు సిద్ధమవుతున్న చంద్రబాబు ప్రభుత్వంపై సచివాలయ ఉద్యోగులు మండిపడుతున్నారు. గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగులకు నష్టం జరిగే పరిస్థితులు ఉత్పన్నమయ్యే సందర్భంలో న్యాయం కోసం పోరాడటానికి లక్షా 30 వేల మంది సిద్ధంగా ఉన్నారని గ్రామ, వార్డు సచివాలయ ఎంప్లాయిస్ ఫెడరేషన్ చెబుతోంది. దీనిపై చట్టానికి లోబడి ఐక్యకార్యాచరణ రూపొందిస్తామని ప్రకటించింది.