ఆంధ్రప్రదేశ్ పదో తరగతి (SSC) పబ్లిక్ పరీక్షల ఫలితాలు తాజాగా విడుదలయ్యాయి. బుధవారం ఉదయం 10 గంటలకు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ (Nara Lokesh) సోషల్ మీడియా వేదికగా ఫలితాలను విడుదల చేశారు. ఈ సంవత్సరం 6,14,459 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా, అందులో 4,98,585 మంది ఉత్తీర్ణులయ్యారు. మొత్తం ఉత్తీర్ణత శాతం 81.14%గా నమోదైంది.
పార్వతీపురం మన్యం (Parvathipuram Manyam) జిల్లా 93.90% ఉత్తీర్ణతతో రాష్ట్రంలో తొలి స్థానాన్ని సాధించడం గర్వంగా ఉందని మంత్రి నారా లోకేశ్ ట్వీట్‌లో పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 1,680 పాఠశాలలు 100 శాతం ఫలితాలను నమోదు చేసినట్లు మంత్రి వెల్లడించారు. ఫలితాల్లో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులందరికీ మంత్రి హృదయపూర్వక అభినందనలు తెలిపారు.
విఫలమైనవారికి మరో అవకాశం
పరీక్షల్లో ఫెయిల్ అయినవారు నిరుత్సాహపడవద్దని, రెండో అవకాశం ఉందని మంత్రి పేర్కొన్నారు. సప్లిమెంటరీ పరీక్షలు మే 19 నుంచి 28 తేదీ వరకు జరుగుతాయని తెలిపారు. ఇది పాస్ అయ్యే మరో అవకాశం అని పేర్కొన్నారు. విద్యార్థులు తమ SSC ఫలితాలను ఈ క్రింది వెబ్‌సైట్లలో చెక్ చేసుకోవచ్చు.. https://bse.ap.gov.in లేదా https://apopenschool.ap.gov.in
📢 The SSC Public Examinations results for March 2025 have been announced. 📢
— Lokesh Nara (@naralokesh) April 23, 2025
This year, out of 6,14,459 students who appeared, 4,98,585 have passed, achieving a pass percentage of 81.14%👏👍🏻. I'm delighted to see that Parvathipuram Manyam district has topped the list with an…








