---Advertisement---

ఏపీలో మ్యాడ్ స్క్వేర్, రాబిన్‌హుడ్‌ టికెట్ ధరలు పెంపు

ఏపీలో మ్యాడ్ స్క్వేర్, రాబిన్‌హుడ్‌ టికెట్ ధరలు పెంపు
---Advertisement---

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉగాది సందర్భంగా విడుదల కానున్న రెండు కొత్త సినిమాల టికెట్ ధరల పెంపున‌కు అనుమతించింది. ఈ నిర్ణయంతో నార్నె నితిన్, సంతోష్ శోభన్ నటించిన మ్యాడ్ స్క్వేర్ మరియు నితిన్, శ్రీ‌లీల జంట‌గా నటించిన రాబిన్‌హుడ్ సినిమాలకు వర్తించనుంది. ప్రభుత్వ అనుమతి ప్రకారం, సింగిల్ స్క్రీన్లలో టికెట్ ధరకు రూ.50, మల్టీప్లెక్సుల్లో రూ.75 వరకు అదనంగా పెంచుకునే అవకాశం ఉంది. అయితే, ఈ పెంపు నిర్ణయం కేవలం 7 రోజులపాటు మాత్రమే అమలులో ఉంటుందని స్పష్టం చేశారు.

కాగా త్వరలోనే విడుదల కాబోతున్న మ్యాడ్ స్క్వేర్, రాబిన్‌హుడ్‌ సినిమాలపై ప్రస్తుతం మంచి హైప్ ఉంది. ఈ నిర్ణయం నిర్మాతలకు ఉపశమనం కలిగించగా, ప్రేక్షకులు మాత్రం పెరిగిన ధరలపై మిశ్రమ స్పందన వ్యక్తం చేస్తున్నారు.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment