ఏపీ విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ జాడ తెలియలేకుంది. గత వారంగా ఆయన కనిపించడం లేదని అధికారులు అంటున్నారు. ఎవరికీ చెప్పాపెట్టకుండా విదేశాలకు వెళ్లారని, నిన్న సాయంత్రమే హైదరాబాద్‌లో ప్రత్యక్షమయ్యారని పార్టీ వర్గాల సమాచారం. లోకేష్ విదేశీ పర్యటనపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కూటమి అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లో లోకేష్ విదేశీ పర్యటన చేయడం ఇది మూడోసారి కావడం గమనార్హం. మంత్రి పర్యటనకు సంబంధించి జీఏడీ ఇచ్చే లెటర్లను కూడా రహస్యంగా ఉంచుతున్నట్లుగా తెలుస్తోంది.
మూడుసార్లు విదేశీ పర్యటనలు చేసిన లోకేష్, ఎప్పుడూ అధికారిక సమాచారం ఇవ్వలేదని, తన శాఖకు సంబంధించిన అధికారులు, ఫ్యామిలీతో కాకుండా తానొక్కడే విదేశాలకు వెళ్లడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ఏ కారణంతో లోకేష్ ఇతర దేశాలకు వెళ్తున్నారో చెప్పాలని, ఆరు నెలల్లో రాష్ట్రాన్ని అడ్డగోలుగా దోచుకున్నది దాచుకోవడానికి వెళ్తున్నారా..? అని ప్రతిపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి. తన విదేశీ పర్యటనలపై లోకేష్ నోరు విప్పాల్సిన అవసరం ఏర్పడింది.