ల‌డ్డూపై చ‌ర్చ వేళ‌.. చైర్మన్‌పై అవిశ్వాసం లీకులు?

ల‌డ్డూపై చ‌ర్చ వేళ‌.. చైర్మన్‌పై అవిశ్వాసం లీకులు?

ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) శాస‌న‌మండ‌లిలో (Legislative Council) మరోసారి ఉద్రిక్తతలు నెలకొన్నాయి. ఇవాళ కీల‌క‌మైన ల‌డ్డూ అంశంపై (Laddu Discussion) చ‌ర్చ సంద‌ర్భంగా ఈ అంశాన్ని డైవ‌ర్ట్ చేసేందుకు మండలి చైర్మన్ మోషేన్ రాజు (Moshen Raju)పై అవిశ్వాసం అంటూ ఓ వర్గం మీడియాలో బెదిరింపుల లీకులు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.

ఫిరాయింపు ఎమ్మెల్సీల రాజీనామా లీకులు
వైసీపీ(YSRCP) తరఫున గెలిచిన కొందరు ఎమ్మెల్సీలు ఇటీవల తెలుగుదేశం పార్టీ (TDP), జనసేన పార్టీ (Jana Sena Party)లకు దగ్గరవడం తెలిసిందే. ఇవాళ ల‌డ్డూపై చ‌ర్చ జ‌రుగుతున్న నేప‌థ్యంలో ఆ అంశాన్ని మ‌రుగున‌ప‌రిచేందుకు మొద‌ట ఫిరాయింపు ఎమ్మెల్సీలు రాజీనామా (Resignation) చేస్తున్న‌ట్లుగా ఓ వ‌ర్గం మీడియా లీకులు ఇచ్చింది. మండలిలో వైసీపీ బలం ఎక్కువగానే ఉండటంతో ల‌డ్డూపై త‌మ వాదన‌ల‌ను స‌మ‌ర్థంగా వినిపిస్తార‌ని గ్ర‌హించిన అధికార ప‌క్షం ఇలా మీడియా లీకులు ఇచ్చిన‌ట్టుగా చ‌ర్చ జ‌రుగుతోంది.

లడ్డూ చర్చ – ప్రభుత్వ వ్యూహమా?
మండలి సమావేశాలు ప్రారంభమైన నాటి నుంచి తిరుమల తిరుపతి దేవస్థానంలో శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీలో ఉపయోగించే నెయ్యి సరఫరా (Ghee Supply) అంశంపై చర్చించాలని వైసీపీ పట్టుబడుతోంది. హెరిటేజ్ (Heritage Foods), ఇందాపూర్ (Indapur) సంబంధాలపై పూర్తి వివరణ ఇవ్వాలని డిమాండ్ చేస్తోంది. ఈ నేప‌థ్యంలో అసెంబ్లీలో పూర్తి మెజార్టీతో ఉండ‌డంతో సీఎం చంద్ర‌బాబు త‌న స్టేట్‌మెంట్‌ను స‌భ‌కు వినిపించారు. మండ‌లిలో వైసీపీకి మెజార్టీ ఉండ‌డంతో ఇక్క‌డ చ‌ర్చ‌కు అంగీక‌రించిన అధికార కూట‌మి.. స్టేట్‌మెంట్‌తోనే స‌రిపెట్టాల‌ని ప్ర‌య‌త్నించింది. అయితే వైసీపీ అడ్డుప‌డి చ‌ర్చ‌కు డిమాండ్ చేయ‌డంతో చైర్మ‌న్ అందుకు స‌మ‌య‌మిచ్చారు.

అవిశ్వాసం లీకులు – ముందస్తు ఒత్తిడా?
ఇవాళ లడ్డూ అంశంపై చర్చ జరగాల్సిన నేపథ్యంలో, చైర్మన్‌పై (Chairman) అవిశ్వాసం మోషన్ తెస్తారంటూ కూటమి ప్రభుత్వం మీడియాకు లీకులు ఇచ్చింద‌ని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. చర్చ ప్రారంభమయ్యే ముందే స్టేట్‌మెంట్ ఇవ్వాలని ప్రభుత్వం పట్టుబడటం వెనుక వాకౌట్ వ్యూహం ఉండొచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు.

మంత్రి పయ్యావుల (Payyavula Keshav) స్టేట్‌మెంట్ ఇచ్చిన వెంటనే “చర్చ ముగిసింది” అంటూ వాకౌట్ చేయాలనే యోచనలో ప్రభుత్వం ఉందన్న అభిప్రాయం వినిపిస్తోంది. అందుకే పూర్తి స్థాయి చర్చకు అవకాశం ఇవ్వకుండా ముందుగా స్టేట్‌మెంట్ ఇవ్వాలని పట్టుబడుతోందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మొత్తానికి ఫిరాయింపు ఎమ్మెల్సీలు, రాజీనామాలు, లడ్డూ చర్చ, చైర్మ‌న్‌పై అవిశ్వాసం బెదిరింపులు ఇవన్నీ కలిసి మండలిలో ఉద్రిక్త వాతావరణం సృష్టిస్తున్నాయి.

Join WhatsApp

Join Now

Leave a Comment