ఏపీ ఇంటర్మీడియట్ ఫలితాలు విడుదల

ఏపీ ఇంటర్మీడియట్ ఫలితాలు విడుదల

విద్యార్థులు, వారి త‌ల్లిదండ్రులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్న ఇంటర్మీడియట్ (Intermediate) ఫలితాలు (Results) వ‌చ్చేశాయి. ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) ఇంటర్ బోర్డు (Inter Board) తాజాగా ఇంటర్ ఫస్టియర్, సెకండియర్ ఫలితాలను ప్రకటించింది (Announced). ఈసారి దాదాపు 10 లక్షల మంది విద్యార్థులు పరీక్షలు రాశారు. ఈ పరీక్షలు మార్చి 1 నుంచి 20వ తేదీ వరకు జరిగాయి. మార్చి – 19 వరకు ఫస్టియర్‌ పరీక్షలు జరగగా, మార్చి 3- 20 వరకు సెకండియర్‌ పరీక్షలను నిర్వహించారు. 

ఈ ఏడాది ఫస్టియర్ విద్యార్థుల ఉత్తీర్ణత శాతం 70 శాతం, సెకండియర్ విద్యార్థులది 83 శాతంగా ఉంది. ముఖ్యంగా ప్రభుత్వ మరియు ప్రభుత్వ అనుబంధ కళాశాలల్లో ఫ‌స్ట్ ఇయ‌ర్ ఉత్తీర్ణ‌త శాతం 47 శాతం, రెండవ సంవత్సరం ఉత్తీర్ణత శాతం 69% ఉంది. ఫలితాలు చూసేందుకు విద్యార్థులు (Students) ప్ర‌భుత్వ అధికారిక వెబ్‌సైట్ https://resultsbie.ap.gov.inలో సందర్శించవచ్చు.

Join WhatsApp

Join Now

Leave a Comment