ఇకపై ప్రభుత్వ ఉత్తర్వులు తెలుగులోనూ జారీ.. – ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం

ఇకపై ప్రభుత్వ ఉత్తర్వులు తెలుగులోనూ జారీ.. - ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఒక చారిత్రక నిర్ణయం తీసుకుంది. ఇకపై అన్ని ప్రభుత్వ ఉత్తర్వులు తెలుగులో కూడా జారీ చేయాలని నిర్ణయించింది. ఈ నిర్ణయంతో, ఇంగ్లిష్, తెలుగు రెండు భాషల్లోనూ ఉత్తర్వులు ఇవ్వడం ప్రారంభం కానుంది. సాధారణ పరిపాలన శాఖ (General Administration Department) వివిధ శాఖల‌న్ని మొద‌ట ఇంగ్లిష్‌లో ఉత్తర్వులు ఇవ్వాలని, రెండు రోజుల్లో అవి తెలుగులో అనువాదం చేయాలని ఆదేశాలు జారీ చేసింది.

అనువాద ప్రక్రియ కోసం డైరెక్టర్‌ ఆఫ్‌ ట్రాన్స్‌లేషన్‌ సేవలు సహాయం తీసుకోవాలని సూచించారు. ఈ నిర్ణయం కేవలం ప్రభుత్వ అధికారిక అంశాలను మాత్రమే కాదు, ప్రజలకు మరింత సులభతరమైన సమాచారాన్ని అందించే దిశగా కూడా అడుగులేస్తుందని ఆ శాఖ అభిప్రాయ‌ప‌డింది.

మహాసభలో తీర్మానం
ఏపీ ప్ర‌భుత్వం తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతించిన కవులు, రచయితలు, ముఖ్యంగా విజయవాడలో నిర్వహించిన ప్రపంచ తెలుగు రచయితల మహాసభలో, పాలనా వ్యవహారాలు తెలుగులో జారీ చేయడం అవసరం అని తీర్మానించారు.

Join WhatsApp

Join Now

Leave a Comment