మహిళలకు (Women) ఉచిత బస్ (Free Bus) ప్రయాణ పథకాన్ని (Travel Scheme) మరికొన్ని రోజుల్లో ప్రారంభించనుంది. ఈ పథకానికి ‘స్త్రీశక్తి’ (‘Sthree Shakti’)గా నామకరణం చేసిన కూటమి ప్రభుత్వం (Coalition Government) ఆగస్టు 15 నుంచి అమలు చేయనున్నట్లు ప్రభుత్వ ఉత్తర్వు (జీవో) విడుదల చేసింది. ఈ పథకం కింద రాష్ట్రవ్యాప్తంగా మహిళలు ఆర్టీసీ ఆర్డినరీ (RTC Ordinary), పల్లెవెలుగు (Palle Velugu), అల్ట్రా పల్లెవెలుగు (Ultra Palle Velugu), ఎక్స్‌ప్రెస్ (Express), మెట్రో ఎక్స్‌ప్రెస్ (Metro Express) బస్సుల్లో ఉచితంగా ప్రయాణించవచ్చని జీవో(GO)లో పేర్కొంది. అర్హత గుర్తించేందుకు ఆధార్ (Aadhaar), ఓటరు (Voter) లేదా రేషన్ కార్డు (Ration Card) ఆధారంగా జీరో ఫేర్ టికెట్లు జారీ చేయనున్నారు. ఈ పథకం వార్షిక ఖర్చు రూ. 1,950 కోట్లను ఆర్టీసీకి ప్రభుత్వం రీయింబర్స్ చేయనుంది.
మహిళల భద్రత, సౌకర్యం కోసం ప్రభుత్వం పలు చర్యలు ప్రకటించింది. ఆర్టీసీ బస్సుల్లో మహిళా కండక్టర్ల (Female Conductors) యూనిఫామ్‌లకు (Uniforms) బాడీ కెమెరాలను (Body Cameras) అమర్చనున్నారు, బస్ స్టేషన్లలో సీసీటీవీ, మహిళలకు ప్రత్యేక విశ్రాంతి గదులు, టాయిలెట్లు వంటి సదుపాయాలను మెరుగుపరచాలని ఆదేశాలు జారీ అయ్యాయి. సీఎం(CM) చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) ఈ పథకాన్ని ఆగస్టు 15న అధికారికంగా ప్రారంభించనున్నారు. ఇది కూటమి ప్రభుత్వం ఎన్నికల హామీల్లో ఒకటిగా ఉంది. స్థానికులు, మహిళా సంఘాలు ఈ పథకాన్ని స్వాగతిస్తూ, మహిళల సాధికారతకు ఇది ఒక చారిత్రక ముందడుగని పేర్కొన్నారు. అయితే, ఈ పథకం సమర్థవంతమైన అమలు, ఆర్టీసీ ఆర్థిక స్థిరత్వంపై విపక్షాలు ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి.
తెలంగాణలోని మహాలక్ష్మి పథకం అమలును అనుసరిస్తున్న ఏపీ ప్రభుత్వం.. మరి బస్సులలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అరికట్టగలదా..? అనే ప్రశ్నలు కూడా ఉత్పన్నమవుతున్నాయి.
#BREAKING
— Telugu Feed (@Telugufeedsite) August 11, 2025
స్త్రీశక్తి పథకం జీవో విడుదల
ఈనెల 15నుంచి స్త్రీశక్తి పథకం అమలు..
ఆర్డినరీ, పల్లెవెలుగు, అల్ట్రా పల్లె వెలుగు, ఎక్స్‌ప్రెస్, మెట్రో ఎక్స్‌ప్రెస్‌లో ఉచిత ప్రయాణం
మహిళా కండక్టర్ల యూనిఫామ్‌కు కెమెరాలు అటాచ్ pic.twitter.com/cAXIDSWunB