ఏపీ ఫైబర్ నెట్ నుంచి 410 మంది ఉద్యోగులను తొలగిస్తున్నట్లుగా ఛైర్మన్ జీవీ రెడ్డి ప్రకటించారు. అపాయింట్‌మెంట్ లెటర్ లేనివారిని తొలగిస్తున్నామని చెప్పారు. ఉద్యోగాల తొలగింపుపై మంగళవారం మీడియాతో మాట్లాడిన ఆయన.. నియామకాలపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. గత ప్రభుత్వం నియామకాల్లో అవకతవకలకు పాల్పడిందని ఆరోపించారు.
వెరిఫికేషన్ లేకుండా నియామకాలు
వైసీపీ హయాంలో ఏపీ ఫైబర్ నెట్‌లో అవసరం లేకపోయినా ఎక్కువమందిని నియమించారని జీవీ రెడ్డి చెప్పారు. వైసీపీ నేతల సిఫార్సులతో అడ్డగోలు నియామకాలు జరిపారని, అక్రమ నియామకాలను తొలగిస్తున్నామని చెప్పారు. కోర్టు సమస్యలు రాకుండా ఈ చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు.
మార్గదర్శకాలు పాటించాలన్న పిలుపు
ఫైబర్ నెట్‌లో పారదర్శకతను నెలకొల్పడానికి ప్రయత్నిస్తుందని జీవీ రెడ్డి పేర్కొన్నారు. “డిపార్ట్‌మెంట్ పనితీరును మెరుగుపరచడం, నిజాయితీతో కూడిన విధానాలను అమలు చేయడం ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు.








