నాణ్య‌మైన లేబుల్‌తో న‌కిలీ మ‌ద్యం.. ఏపీలో సంచ‌ల‌నం (Videos)

నాణ్య‌మైన లేబుల్‌తో న‌కిలీ మ‌ద్యం.. ఏపీలో సంచ‌ల‌నం (Videos)

ఆంధ్ర‌ప్ర‌దేశ్ (Andhra Pradesh) రాష్ట్రంలో న‌కిలీ మ‌ద్యం (Fake Liquor) త‌యారీ స్థావ‌రాలు ఒక్కొక్క‌టిగా బ‌య‌ట‌కు వ‌స్తున్నాయి. గ‌త రెండ్రోజుల క్రితం అన్న‌మ‌య్య జిల్లాలో ఆబ్కారీ శాఖ అధికారుల‌కు ప్రాణాంత‌క స్పిరిటీ, క‌ల్తీ మ‌ద్యం, ఖాళీ సీసాలు, మెషిన‌రీలు బ‌య‌ట‌ప‌డ‌గా, అది మొల‌క‌ల‌చెరువులో భారీగా క‌ల్తీ బీర్ బాటిళ్ల డంప్ బ‌య‌ట‌ప‌డింది. తాజాగా ఎన్టీఆర్ జిల్లా ఇబ్ర‌హీంప‌ట్నంలో భారీగా క‌ల్తీ మ‌ద్యం బ‌య‌ట‌ప‌డింది.

రెండ్రోజుల క్రితం అన్నమయ్య జిల్లా మొలకలచెరువులో ప్రాణాంతక స్పిరిట్లు, క‌ల్తీ మద్యం తయారీకి ఉపయోగించే యంత్రాలు, ఖాళీ బాటిళ్లు స్వాధీనం చేసిన అధికారులు.. తాజాగా ఎన్టీఆర్ జిల్లాలో టీడీపీ నేత అద్దేపల్లి జనార్ధన్‌కు చెందిన గోడౌన్‌లో అదే తరహా కుంభకోణాన్ని గుర్తించారు. అతని ఏఎన్‌ఆర్ బార్ మరియు గోడౌన్‌లలో విపరీతంగా నకిలీ మద్యం స్టాక్ దొరికింది.

క‌ల్తీ మ‌ద్యం కోసం ఉప‌యోగించే ఖాళీ బాటిళ్లు, లేబుల్స్, సీలింగ్ మెషీన్లు, భారీగా క‌ల్తీ మ‌ద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ కుంభకోణం చిత్తూరు జిల్లా నుండి ఎన్టీఆర్ జిల్లా వరకు వ్యాపించినట్లు ఎక్సైజ్ శాఖ ప్రాథమిక విచారణలో తేలింది. మైలవరం నియోజకవర్గానికి చెందిన అద్దేపల్లి జనార్ధన్ ప్రస్తుతం పరారీలో ఉన్నారు. కల్తీ మద్యం కేసు వెనుక రాజకీయ నేతలు ఉన్నారనే వార్తలతో రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేగింది.

భారీగా బ‌య‌ట‌ప‌డుతున్న క‌ల్తీ మ‌ద్యంతో మందుబాబులు బెంబేలెత్తిపోతున్నారు. ప్ర‌తీ కాట‌న్‌లో మూడు క‌ల్తీ మ‌ద్యం బాటిళ్లు ఉంటున్నాయ‌నే పుకారు రాష్ట్రం వ్యాప్తంగా జోరుగా సాగుతోంది. ఈ క‌ల్తీ మ‌ద్యం త‌యారీ వెనుక తెలుగుదేశం పార్టీ నాయ‌కులు ఉండ‌డంతో ఈ కేసు ఇంకా సంచ‌ల‌నంగా మారింది. ముందు జాగ్ర‌త్త‌గా క‌ల్తీ మ‌ద్యం కేసులో ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్న తంబళ్లపల్లె టీడీపీ ఇంచార్జి జయచంద్రారెడ్డి, సురేంద్ర నాయుడు స‌స్పెండ్‌ను ఆ పార్టీ అధిష్టానం స‌స్పెండ్ చేసింది.

నాణ్య‌మైన లేబుల్స్ వేసి న‌కిలీ మ‌ద్యం అమ్ముతున్నార‌నే చ‌ర్చ జ‌రుగుతోంది. కొంద‌రి నేత‌ల ధ‌న దాహం కోసం ప్ర‌జ‌ల ప్రాణాల‌ను ఫ‌ణంగా పెడుతున్నార‌ని, న‌కిలీ మ‌ద్యంతో మందుబాబుల జీవితాల‌తో చెల‌గాటం ఆడుతున్నార‌ని తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment