ఆపరేషన్ సింధూర్‌పై జగన్ సంచ‌ల‌న ట్వీట్‌

ఆపరేషన్ సింధూర్‌పై జగన్ సంచ‌ల‌న ట్వీట్‌

పాకిస్తాన్‌ (Pakistan)పై భార‌త్ (India) ప్ర‌తీకార చ‌ర్య‌ల‌కు దిగింది. అమాయ‌క టూరిస్టుల ప్రాణాల‌ను బ‌లితీసుకున్న వారి స్థావ‌రాల‌ను ల‌క్ష్యంగా చేసుకొని మంగ‌ళ‌వారం అర్ధ‌రాత్రి ఆప‌రేష‌న్ సింధూర్ (Operation Sindhoor) పేరుతో మెరుపుదాడుల‌కు పాల్ప‌డింది. భార‌త్ మిస్సైల్ దాడి (India Missile Strike)లో తొమ్మిది ఉగ్ర‌వాద స్థావ‌రాలు నామ‌రూపాల్లేకుండా పోయాయి. భార‌త్ చేప‌ట్టిన ఆప‌రేష‌న్ సింధూర్‌పై ఆంధ్ర‌ప్ర‌దేశ్ (Andhra Pradesh) మాజీ సీఎం (Former CM), వైసీపీ అధ్య‌క్షుడు వైఎస్ జ‌గ‌న్ (YS Jagan) స్పందించారు.

ఆపరేషన్ సింధూర్‌పై వైఎస్ జ‌గ‌న్ (YS Jagan) సంచ‌ల‌న ట్వీట్ చేశారు. పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత రక్షణ దళాలు చేపట్టిన ఈ ఆపరేషన్‌పై ఆయన ట్విట్ట‌ర్‌లో స్పందించారు.

“భారత రక్షణ దళాలు పహల్గాం ఉగ్రదాడికి ప్రతిగా ఆపరేషన్ సింధూర్‌ను ప్రారంభించాయి. ఇలాంటి సందర్భాల్లో ఇటువంటి నిర్ణయాత్మ‌క‌ చర్యలు దేశ సార్వభౌమత్వాన్ని కాపాడటంలో, పౌరుల రక్షణలో భారతదేశం చూపే అపారమైన శక్తిని ప్రతిబింబిస్తాయి. మీమంతా మీతోనే, మీకు మ‌ద్ద‌తుగా ఉన్నాం. జై హింద్! (Jai Hind)” అని జగన్ భావోద్వేగ‌ ట్వీట్ ( EmotionalTweet) చేశారు.

Join WhatsApp

Join Now

Leave a Comment