ప‌వ‌న్‌కు అస్వ‌స్థ‌త‌.. నెటిజ‌న్ల ఆసక్తిక‌ర కామెంట్లు

ప‌వ‌న్‌కు అస్వ‌స్థ‌త‌.. నెటిజ‌న్ల ఆసక్తిక‌ర కామెంట్లు

ఆంధ్ర‌ప్ర‌దేశ్ డిప్యూటీ సీఎం, జ‌న‌సేన పార్టీ అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ అస్వ‌స్థ‌త‌కు గుర‌య్యారు. అనారోగ్య కార‌ణంగా హైద‌రాబాద్‌లోని అపోలో ఆస్ప‌త్రిలో చేరారు. అనారోగ్య స‌మ‌స్య‌ల‌తో ఆయ‌న అపోలో ఆస్ప‌త్రిలో ప‌వ‌న్ వైద్య పరీక్షలు చేయించుకున్నారు. స్కానింగ్, సంబంధిత పరీక్షలు నిర్వహించారు వైద్యులు. రిపోర్ట్స్ పరిశీలించిన వైద్యులు పలు సూచనలు చేశారు.

ప‌వ‌న్ క‌ళ్యాణ్‌కు మరికొన్ని వైద్య పరీక్షలు చేయాల్సిన అవసరం ఉందని, ఈ నెలాఖరు గానీ, మార్చి మొదటి వారంలోగానీ మిగిలిన వైద్య పరీక్షలు చేయించుకుంటార‌ని జ‌న‌సేన పార్టీ అధికారికంగా ప్ర‌క‌టించింది. 24వ తేదీ నుంచి మొదలయ్యే బడ్జెట్ సమావేశాలకు పవన్ హాజరవుతారని తెలిపింది.

ధ‌ర్మం త‌ప్పుతుంటే.. స‌నాత‌ని ఎక్క‌డ‌..?
కాగా, జ‌న‌సేన పార్టీ ఎక్స్ పోస్టుపై నెటిజ‌న్లు చేస్తున్న కామెంట్లు ఆస‌క్తిక‌రంగా మారాయి. ఏపీపీఎస్సీ రోస్ట‌ర్ విధానంలో తప్పులు ఉన్నాయని అభ్య‌ర్థులు పెద్ద ఎత్తున చేస్తుంటే.. సనాతన ధర్మ రక్షకుడు ఎక్క‌డున్నాడ‌ని, కూట‌మి ప్రభుత్వం ధర్మం తప్పుతుంటే, ధ‌ర్మ ప‌రిర‌క్ష‌కుడు ఎక్కడ ఉన్నాడని కామెంట్లు పెడుతున్నారు. రాష్ట్రంలో స‌మ‌స్య‌లు ఉన్న‌ప్పుడే రోగం వ‌స్తుందా..? అని ప్ర‌శ్నిస్తున్నారు. మ‌రికొంద‌రు త్వ‌ర‌గా కోలుకోవాల‌ని కామెంట్లు పెడుతున్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment