ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్(Pawan Kalyan) కాన్వాయ్‌లో ప్రమాదం జరిగింది. పవన్ కాన్వాయ్‌లోని వాహనం ఢీకొని ఓ వ్యక్తం తీవ్రంగా గాయపడినట్లు సమాచారం. డిప్యూటీ సీఎం కాన్వాయ్ ప్రమాదానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
మంగళగిరి జనసేన పార్టీ కార్యాలయం సమీపంలోని డీజీపీ ఆఫీస్ రోడ్డులో ఈ ప్రమాదం జరిగినట్లుగా తెలుస్తోంది. పవన్ కాన్వాయ్ ఢీకొని గాయపడిన వ్యక్తిని సమీపంలోని ఎన్ఆర్ఐ ఆస్పత్రికి తరలించారు. గాయపడిన వ్యక్తి రాధారంగా నగర్ నివాసితుడిగా గుర్తించారు. ప్రస్తుతం క్షతగాత్రుడి ఆరోగ్య పరిస్థితి గురించి వివరాలు తెలియాల్సి ఉంది. డిప్యూటీ సీఎం కాన్వాయ్ వెళ్తున్న సమయంలో ట్రాఫిక్ క్లియర్ చేయకపోవడం వల్లే ఈ ప్రమాదం సంభవించినట్లుగా తెలుస్తోంది. ఈ ప్రమాదంపై జనసేన పార్టీ నుంచి ఎలాంటి ప్రకటన వెలువడలేదు.
డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కాన్వాయ్ ఢీకొని వ్యక్తికి ప్రమాదం
— Telugu Scribe (@TeluguScribe) March 1, 2025
తాడేపల్లిలోని డీజీపీ ఆఫీస్ వద్ద ఘటన
ఎన్నారై హాస్పిటల్‌కు తరలించిన పవన్ కళ్యాణ్ సిబ్బంది
రాధా రంగా నగర్‌కు చెందిన వ్యక్తిగా గుర్తింపు pic.twitter.com/fnjLhHoGJu