---Advertisement---

కూటమి నేతల ఘర్షణ.. జనసేన మహిళా కార్పొరేటర్‌పై టీడీపీ దాడి

కూటమి నేతల ఘర్షణ.. జనసేన మహిళా కార్పొరేటర్‌పై టీడీపీ దాడి
---Advertisement---

ఆంధ్రప్రదేశ్‌లో కూటమి నేతల మధ్య విభేదాలు తీవ్రతరం అవుతున్నాయి. ప్రకాశం జిల్లాలో తాజా ఉదంతం రాజకీయ వర్గాల్లో కలకలం రేపింది. ఒంగోలు నగర 32వ డివిజన్‌ జనసేన మహిళా కార్పోరేటర్‌ కృష్ణలత దంపతులపై టీడీపీ కార్యకర్తలు దాడి చేయడం వివాదానికి కేంద్రబిందువుగా మారింది.

అర్ధ‌రాత్రి, టీడీపీ కార్యకర్త తోటకూర కృష్ణమూర్తి, కార్పోరేటర్‌ కృష్ణలత దంపతులను ఇంటి బయటకు పిలిచి, తన సహచరులతో కలిసి దాడి చేశాడు. ఈ దాడిలో కృష్ణలత దంపతులకు స్వల్ప గాయాలైనట్టు సమాచారం. ఈ ఘటనపై స్పందించిన కృష్ణలత, తమకు ప్రాణహాని ఉందని పేర్కొన్నారు. “నా భర్తను కొట్టారు. మా కుటుంబానికి న్యాయం చేయాలి” అని ఆవేదన వ్యక్తం చేశారు.

ఈ సంఘటన కూటమి సర్కార్‌లో నేతల మధ్య విభేదాలను మరింత చర్చనీయాంశంగా మార్చింది. ప్రస్తుతం బాధితులు తమ కుటుంబ భద్రత కోసం అధికారుల వద్దకు వెళ్లినట్టు తెలిసింది.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment