కొందరు మంత్రుల పనితీరుపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అసంతృప్తితో ఉన్నట్లుగా తెలుస్తోంది. ఎవరు యాక్టివ్‌గా ఉన్నారు.. ఎవరు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారో తెలుసుకునేందుకు సీఎం ఐవీఆర్ఎస్ సర్వే నిర్వహించినట్లు సమాచారం. ఈ సర్వే ద్వారా మంత్రుల పనితీరుపై ప్రజల అభిప్రాయాలను సేకరించారట. అయితే సర్వే రిపోర్టు చూసిన అనంతరం చంద్రబాబు కూడా షాకైనట్లు తెలుస్తోంది. మంత్రివర్గంలో 75 శాతం మంది పనితీరు ఆశాజనకంగా లేదని సర్వే రిపోర్ట్‌లో తేలినట్లు తెలుస్తోంది.
కేబినెట్‌లో కీలక సూచనలు
ఇటీవల జరిగిన కేబినెట్ సమావేశంలో, మంత్రులు తమ పనితీరును మెరుగుపరుచుకోవాలని సీరియస్ సూచన చేసినట్లుగా తెలుస్తోంది. పార్టీ శ్రేణులకు ముఖ్యమైన సూచనలు చేసిన చంద్రబాబు, ప్రతి మంత్రి పార్టీ లైన్‌ను దాటి మాటలు మాట్లాడరాదని స్పష్టం చేశారు. అలాగే, వైసీపీ విమర్శలకు ధీటుగా సమాధానం ఇచ్చేలా నైతికంగా సిద్ధంగా ఉండాలని సూచించారు.
వీరిద్దరికి ఏ శాఖలు..
జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి, పవన్ కల్యాణ్ అన్న నాగబాబుకు మంత్రి పదవి ఇస్తానని చంద్రబాబు ప్రకటించారు. అదే విధంగా టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావుకు కూడా కేబినెట్‌లో చోటు దక్కనున్నట్లు తెలుస్తోంది. కాగా, సర్వే రిపోర్టులో వచ్చిన మార్కుల ఆధారంగా చంద్రబాబు ఎవరి తప్పించి వీరిద్దరి ఛాన్స్ ఇస్తారో వేచి చూడాలి.