ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశంలో అనేక కీలక నిర్ణయాలకు ఆమోదం లభించింది. ఈ భేటీతో రాష్ట్రంలో నూతన అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాలు, మరియు పెట్టుబడుల ప్రోత్సాహంపై చర్చలు సాగాయి. మొత్తం 14 అంశాలపై కేబినెట్ భేటీలో చర్చ జరిగింది.
- అమరావతిలో రూ.2,733 కోట్లు వ్యయంతో చేపట్టనున్న పనులకు ఆమోదం.
- పిఠాపురం ఏరియా డెవలప్‌మెంట్‌లో కొత్తగా 19 పోస్టుల ఏర్పాటు.
- ఎస్‌ఐపీబీ ఆమోదించిన రూ.1,82,162 కోట్ల పెట్టుబడులకు క్యాబినెట్ ఆమోదముద్ర.
- తిరుపతిలో 100 పడకల ఈఎస్‌ఐ ఆస్పత్రి నిర్మాణం.
- గుంటూరులో 100 పడకల ఈఎస్‌ఐ ఆస్పత్రి నిర్మాణం.
- తల్లికి వందనం పథకం వచ్చే విద్యా సంవత్సరం నుంచి అమలు చేయాలని కేబినెట్ నిర్ణయించింది.
- మత్స్యకారులకు వేట నిషేధ సమయంలో ఇచ్చే ఆర్థిక సాయంపై చర్చ.
- రైతులకు కేంద్రం అందించే రూ.10 వేల ఆర్థిక సాయంతో పాటు రాష్ట్రం నుండి మరో రూ.10,000 ఇవ్వాలని, మొత్తం రైతులకు పెట్టుబడి సాయంగా రూ.20 వేలు ఇవ్వాలని నిర్ణయించారు.
- రామాయపట్నంలో బీపీసీఎల్ రిఫైనరీ, కాకినాడలో గ్రీన్ అమ్మోనియా ప్లాంట్ ఏర్పాటు.
- నంద్యాల, కర్నూలు, వైఎస్‌ఆర్ జిల్లాల్లో పవన, సౌర విద్యుత్ ప్రాజెక్టుల ఏర్పాటుకు మంత్రివర్గం ఆమోదం.
ప్రధాని మోదీ పర్యటన
కేబినెట్ భేటీలో ఈ నెల 8న విశాఖపట్నంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పర్యటన విజయవంతంగా జరగాలని, రోడ్‌షో కోసం మంత్రుల సబ్ కమిటీ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ప్రధాని మోదీ విశాఖలో గ్రీన్ హైడ్రోజన్ హబ్‌కి శంకుస్థాపన చేయనున్నారు.







