ఏపీలో 28 జిల్లాలు.. జిల్లాల పునర్విభజనకు గ్రీన్ సిగ్నల్

ఏపీలో 28 జిల్లాలు.. జిల్లాల పునర్విభజనకు గ్రీన్ సిగ్నల్

ఆంధ్రప్రదేశ్‌ (Andhra Pradesh)లో జిల్లాల సంఖ్య మరింత పెరగనుంది. రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో జిల్లాల పునర్విభజన (District Reorganisation) ప్రతిపాదనలకు కేబినెట్ (Cabinet) ఆమోదం తెలిపింది. కొత్త జిల్లాల ఏర్పాటుతో రాష్ట్రంలో జిల్లాల సంఖ్య 28కి చేరనుంది. ఈ మేరకు ఎల్లుండి తుది గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది.

గ‌త వైసీపీ ప్ర‌భుత్వం (YSRCP Government) పార్ల‌మెంట్ ప‌రిధిలోని ఏడు నియోజ‌క‌వ‌ర్గాల‌ను, అక్క‌డున్న ప‌రిస్థితుల ఆధారంగా 13 జిల్లా విభ‌జిత ఆంధ్రప్ర‌దేశ్‌ను 26 జిల్లాలుగా (26 Districts) ఏర్పాటు చేసింది. ప‌రిపాలనను ప్రజలకు మరింత చేరువ చేయాలన్న లక్ష్యం కొత్త జిల్లాల ఏర్పాటును శాస్త్రీయంగా చేప‌ట్టింది. గ‌త ప్ర‌భుత్వం చేప‌ట్టిన 26 జిల్లాల‌ను చంద్ర‌బాబు స‌ర్కార్ 28 జిల్లాలుగా (28 Districts) మార్చింది. అద‌నంగా మ‌రో రెండింటిని యాడ్ చేసింది.

జిల్లాల పునర్విభజనలో భాగంగా పలు నియోజకవర్గాల మార్పులకు కూడా కేబినెట్ గ్రీన్ సిగ్నల్ (Green Signal) ఇచ్చింది. అన్నమయ్య జిల్లాలోని నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణకు ఆమోదం తెలిపిన మంత్రివర్గం, రాయచోటిని కొత్తగా ఏర్పాటు చేయనున్న మదనపల్లె జిల్లాలో కలిపే ప్రతిపాదనను ఆమోదించింది. అలాగే రాజంపేటను కడప జిల్లాలోకి మార్చే ప్రతిపాదనకు, రైల్వేకోడూరును తిరుపతి జిల్లాలో చేర్చే ప్రతిపాదనకు కూడా ఆమోదం లభించింది.

అదేవిధంగా కొత్తగా మదనపల్లె, మార్కాపురం, రంపచోడవరం జిల్లాల ఏర్పాటుకు కేబినెట్ అనుమతి ఇచ్చింది. ఇక జిల్లాల మార్పులలో భాగంగా గూడూరును తిరుపతి జిల్లా నుంచి నెల్లూరు జిల్లాలో కలిపేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. అలాగే కొత్తగా ఐదు రెవెన్యూ డివిజన్ల ఏర్పాటుకు కూడా మంత్రివర్గం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మార్పులన్నింటిపై ఎల్లుండి అధికారిక గెజిట్ నోటిఫికేషన్ వెలువడనుండగా, ఆ వెంటనే అమలు ప్రక్రియ ప్రారంభం కానుంది.

Join WhatsApp

Join Now

Leave a Comment