ఏపీ అసెంబ్లీకీ సోష‌ల్ మీడియా ఖాతాలు

ఏపీ అసెంబ్లీకీ సోష‌ల్ మీడియా ఖాతాలు

ఇకనుంచి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి సంబంధించిన అంశాలు ప్రజలకు మరింత చేరువకానున్నాయి. అసెంబ్లీ కార్యకలాపాలు సోషల్ మీడియాలో ప్రత్యక్షం కానున్నాయి. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, స్పీకర్ అయ్యన్నపాత్రుడు, డిప్యూటీ స్పీక‌ర్ రఘురామకృష్ణరాజు సమక్షంలో ఉండ‌వ‌ల్లిలోని సీఎం నివాసంలో ఈ కొత్త నూతన ప్రయోగాన్ని ప్రారంభించారు.

సమాచారాన్ని చేరవేసే మాధ్యమం
సోషల్ మీడియా ప్లాట్‌ఫార్మ్‌లైన ‘ఎక్స్’ (ట్విట్టర్), యూట్యూబ్, ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్ వేదికలపై ‘జీలెజిస్ ఆంధ్ర’ అనే పేరుతో ఖాతాలు ప్రారంభమయ్యాయి. వీటిలో శాసనసభ కార్యకలాపాలు, చర్చలు, బిల్లులపై సమాచారం ప్రజలకు అందుబాటులో ఉంటుంది.

సామాజిక మాధ్యమాల ఉపయోగం
ఈ మార్పు ద్వారా అసెంబ్లీ వ్యవహారాలు ప్రజలతో సమాంతరంగా మమేకం అవుతాయని, శాసనవ్యవస్థలో జవాబుదారీతనాన్ని పెంపొందించడంలో దోహదపడుతుందని సీఎం అభిప్రాయపడ్డారు. శాసనసభ చర్చలు మరియు నిర్ణయాలు ప్రజలకి సరళమైన భాషలో అందించబడ‌నున్నాయి.

Join WhatsApp

Join Now

Leave a Comment