ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఈనెల 24న ప్రారంభం కానున్నాయి. ఆ రోజు ఉదయం గవర్నర్ ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. బడ్జెట్‌ను ఫిబ్రవరి 28న ప్రవేశపెట్టే అవకాశం ఉంది. ప్రభుత్వం మొత్తం 15 రోజులు బడ్జెట్ సమావేశాలు నిర్వహించాలని యోచిస్తోంది. మొదటి రోజు బిజినెస్ అడ్వైజరీ కమిటీ (BAC) సమావేశం అనంతరం అసెంబ్లీ సమావేశాలు ఎన్ని రోజులు నిర్వహించాలనే అంశంపై నిర్ణయం తీసుకోనున్నారు. అలాగే, అసెంబ్లీ సమావేశాల్లో పాల్గొనే మంత్రులు తమ శాఖల సంబంధిత అంశాలను పూర్తి స్థాయిలో సిద్ధం చేసుకుని హాజరుకావాలని అధికారికంగా ఆదేశాలు జారీ అయ్యాయి.
ఈనెల 24 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు
