---Advertisement---

టెన్త్ పేప‌ర్ లీక్ వెనుక ఇంత క‌థ న‌డిచిందా..!

టెన్త్ పేప‌ర్ లీక్ వెనుక ఇంత క‌థ న‌డిచిందా..!
---Advertisement---

ఆంధ్రప్రదేశ్‌లో పదోతరగతి ఎస్ఏ-1 గణితం పరీక్ష పేపర్ లీక్ కేసు తీవ్ర దుమారం రేపింది. ఈనెల 16న జరగాల్సిన గణితం పరీక్ష పేపర్ పరీక్షకు ముందు రోజే యూట్యూబ్‌లో వెలుగుచూసింది. సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు అందడంతో, వారు దర్యాప్తు చేసి కేసులో ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశారు.

పేపర్ లీక్ వెనుక ఎవరు?
పోలీసుల దర్యాప్తు ప్రకారం, మధ్యప్రదేశ్‌కు చెందిన ఒక బాలుడు యూట్యూబ్‌లో పేపర్ పోస్టు చేశాడు. విచారణలో అతను విజయవాడకు చెందిన టెలిగ్రాం ఛానల్ నుండి పేపర్ పొందినట్లు తెలిపాడు. ఆ ఛానల్ వెనుక ఉన్నది అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రాపురానికి చెందిన టీచర్ తిప్పర్తి వీర వెంకట సుబ్బారావు అని గుర్తించారు.

తన పాఠశాలలో చదువుతున్న పిల్లలు ఎక్కువ మార్కులు తెచ్చుకుని పాఠశాల ప్రతిష్టను పెంచాలని, ఉద్దేశపూర్వకంగానే రామచంద్రాపురం ఎంఈవో శ్రీనివాసరావుతో క‌లిసి గణితం పరీక్ష పేప‌ర్‌ను లీక్ చేసిన‌ట్లు నిర్ధారించారు. ఈ నేపథ్యంలో గణితం పరీక్ష ప్రశ్నపత్రాన్ని యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేసిన అరుణ్‌కుమార్‌తో పాటు, పేపర్ లీక్ చేసిన రామచంద్రపురానికి చెందిన తిప్పర్తి వీర వెంకట సుబ్బారావు, ఎంఈవో మానుపూడి శ్రీనివాసరావులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment