క్రిష్ జాగర్లమూడి (Krish Jagarlamudi) దర్శకత్వంలో అనుష్క (Anushka), విక్రమ్ ప్రభు (Vikram Prabhu) హీరోహీరోయిన్లుగా నటించిన “ఘాటీ” (“Ghaati”) విడుదలకు సిద్ధమైంది. ఈ చిత్రం సెప్టెంబరు 5న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే టీజర్లు, పోస్టర్లు మంచి స్పందన తెచ్చుకోవడంతో సినిమాపై అంచనాలు పెరిగాయి. అనుష్క మరోసారి పవర్ఫుల్ పాత్రలో కనిపించబోతోందన్న ఊహాగానాలు అభిమానుల్లో ఆసక్తిని రేపుతున్నాయి.
‘మిరాయి’ వాయిదా – ‘ఘాటీ’కు అదనపు లాభం
మొదట సెప్టెంబరు 5న ‘మిరాయి’ కూడా విడుదల కావాల్సి ఉండగా, ఆ చిత్రం వాయిదా పడింది. దీంతో అదే రోజున ప్రేక్షకుల ముందుకు వస్తున్న ‘ఘాటీ’ సినిమాకు అదనపు లాభం దక్కే అవకాశముంది. బాక్సాఫీస్‌లో పోటీ తగ్గిన నేపథ్యంలో ఈ చిత్రానికి మరింత కలెక్షన్లు వచ్చే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి.
తమిళంలో హాట్ కంపిటీషన్ – ‘మదరాసి’
ఇక తమిళ ఇండస్ట్రీలో మాత్రం సెప్టెంబరు 5న శివకార్తికేయన్ నటించిన ‘మదరాసి’ చిత్రం విడుదల కాబోతోంది. ఏఆర్ మురుగదాస్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా పట్ల కూడా భారీ అంచనాలున్నాయి. ఈ నేపథ్యంలో తెలుగు, తమిళ పరిశ్రమల్లో ఒకేసారి రెండు ఆసక్తికరమైన సినిమాలు బాక్సాఫీస్‌ను హీట్ చేయనున్నాయి.







