లేడీ ఓరియంటెడ్‌గా అనుష్క శెట్టి నటిస్తున్న 50వ చిత్రం ‘ఘాటి’ క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో తెరకెక్కుతోంది. ఈ సినిమా రాజీవ్ రెడ్డి, సాయిబాబు జాగర్లమూడి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇటీవల విడుదలైన ఈ మూవీ గ్లింప్స్ ప్రేక్షకుల అంచనాలను పెంచేసింది.
ఈ చిత్ర కథ అనుకోని పరిస్థితుల్లో చిక్కుకున్న ఓ మహిళ తన జీవితంలోని దుఃఖాలను అధిగమించి జరిగిన అన్యాయంపై ఎలా పోరాడిందనే పాయింట్‌ను ఆసక్తికరంగా ఆవిష్కరిస్తుంది. అనుష్క పాత్రకు ‘విక్టిమ్, క్రిమినల్, లెజెండ్’ అనే క్యాప్షన్‌ను చిత్రబృందం పోస్టర్‌లో హైలైట్ చేసింది.
'The Queen', at her best, will reign at the box office ❤️🔥
— UV Creations (@UV_Creations) December 15, 2024
▶️ https://t.co/XyPFTiuSLI#Ghaati GRAND RELEASE WORLDWIDE ON 18th APRIL, 2025 💥💥
In Telugu, Tamil, Hindi, Kannada and Malayalam.
'The Queen' #AnushkaShetty @DirKrish @UV_Creations @FirstFrame_Ent pic.twitter.com/FrV2q3hNVo
విడుదల తేదీ ప్రకటించిన చిత్రబృందం
అనుష్క నటిస్తున్న ఘాటి సినిమా విడుదల తేదీని చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది. ‘ఘాటి’ చిత్రం 2025 ఏప్రిల్ 18న థియేటర్లలో ప్రేక్షకులను అలరించనుంది.
14 ఏళ్ల తర్వాత క్రిష్-అనుష్క కలయిక
ఈ చిత్రం విశేషం ఏమిటంటే.. అనుష్క శెట్టి క్రిష్ దర్శకత్వంలో 14 ఏళ్ల తరువాత నటిస్తున్నారు. గతంలో వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన ‘వేదం’ చిత్రం విమర్శకుల ప్రశంసలు అందుకోవడంతో పాటు క్లాసికల్ హిట్‌గా నిలిచింది.