రేవంత్‌ రెడ్డి పేరు మరిచిపోయిన మ‌రో హీరో.. వీడియో వైరల్‌

రేవంత్‌ రెడ్డి పేరు మరిచిపోయిన మ‌రో హీరో.. వీడియో వైరల్‌

తెలంగాణ ముఖ్య‌మంత్రి రేవంత్‌ రెడ్డి పేరును ఓ టాలీవుడ్‌ హీరో క‌మ్ యాంక‌ర్ మ‌రిచిపోయి త‌ప్పుగా ప‌లికాడు. ఇప్పుడా వీడియో సోష‌ల్ మీడియాలో తెగ వైర‌ల్ అవుతోంది. తెలుగు మ‌హాస‌భ‌ల‌కు ముఖ్య అతిథిగా హాజ‌రైన రేవంత్‌రెడ్డికి ఆహ్వానం ప‌లికే క్ర‌మంలో హీరో క‌మ్ యాంక‌ర్‌ బాలాదిత్య నీళ్లున‌మిలాడు, ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి పేరును మ‌రిచిపోయి త‌ప్పుగా ప‌లికాడు.

హైదరాబాద్‌ హైటెక్స్‌లోని ఓ క‌న్వెన్ష‌న్‌లో జ‌రుగుతున్న‌ ప్రపంచ తెలుగు సమాఖ్య మహాసభల చివ‌రి రోజు సీఎం రేవంత్‌ రెడ్డి ముఖ్య అతిథిగా హాజ‌ర‌య్యారు. ఈ సందర్భంగా రేవంత్‌ రెడ్డికి ఆహ్వానం ప‌లుకుతూ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న సినీ నటుడు బాలాదిత్య.. మన ప్రియతమ నాయకులు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు కిరణ్‌కుమార్‌ గారు అంటూ ఉచ్ఛరించాడు. యాంకర్‌ నోటి నుంచి సీఎం కిరణ్‌కుమార్‌ అని రావడంతో సభ కింద ఉన్నవారంతా ఒక్కసారిగా కేకలు వేశారు. దీంతో తాను చేసిన తప్పును యాంకర్‌ గ్రహించి, ఆ వెంటనే తన తల పట్టుకుని స్టేజిపై నుంచి పక్కకు వెళ్లిపోయాడు. ఆ తర్వాత మళ్లీ వచ్చి తన క్షమాపణలు చెప్పాడు. సీఎం రేవంత్ రెడ్డికి ఆహ్వానం అంటూ చెప్ప‌డంతో అక్క‌డున్న‌వారంతా శాంతించారు.

పుష్ప ప్రీరిలీజ్ ఈవెంట్‌లో అల్లు అర్జున్ పేరు మ‌రిచిపోయినందుకే సీఎం రేవంత్‌రెడ్డి నానా హంగామా చేశార‌ని పుకార్లు ఉండ‌గా, దానిని సీఎం రేవంత్ తీవ్రంగా ఖండించిన విష‌యం తెలిసిందే.

Join WhatsApp

Join Now

Leave a Comment