2025 ఆస్కార్(Oscars 2025) వేడుకల్లో ‘అనోరా’ సినిమా(Anora Movie) అత్యుత్తమ విజయాన్ని సాధించింది. బెస్ట్ పిక్చర్ సహా మొత్తం ఐదు అవార్డులు గెలుచుకున్న ఈ చిత్రం, వినోదంతో పాటు భావోద్వేగాలను కూడా మిళితం చేస్తుంది. సినిమా కథ రష్యా యువకుడి గురించి. అతను అమెరికాలో వేశ్యగా పని చేసే యువతిని ప్రేమించి పెళ్లి చేసుకుంటాడు. కానీ ఈ విషయం తెలిసిన అతని కుటుంబం, అతడిని వెనక్కి రప్పిస్తుంది. కుటుంబ ఒత్తిళ్లు, సమాజపు చిన్నచూపులు, ప్రేమ కోసం పోరాటం ఇవన్నీ ఈ కథలో మిళితమై ఉంటాయి.
‘అనోరా’ అనే పేరు లాటిన్ భాషలో గౌరవాన్ని సూచిస్తుంది. వేశ్యలూ మనుషులే, వారిని హీనంగా చూడకూడదనే బలమైన సందేశాన్ని ఈ సినిమా అందిస్తుంది. కామెడీ ముసుగులో ఓ ప్రధానమైన సామాజిక విషయాన్ని చర్చకు తెచ్చిన ఈ చిత్రం, ప్రేక్షకుల హృదయాలను కొల్లగొట్టింది.
‘అనోరా’ సినిమా ఐదు ముఖ్యమైన విభాగాల్లో అవార్డులను గెలుచుకుంది. ఉత్తమ చిత్రం, ఉత్తమ దర్శకుడు, ఉత్తమ ఒరిజినల్ స్క్రీన్ప్లే, ఉత్తమ ఎడిటింగ్, ఉత్తమ నటి కేటగిరీలలో ఆస్కార్ అవార్డులను గెలుచుకుంది.