రాత్రింబవళ్లు కష్టపడి పండించిన పంటకు కనీసం రవాణా ఖర్చులు కూడా రాకపోవడంతో ఆ పంటను రోడ్డు (Road) మీద పారేసుకున్నాడో రైతు. ఇంత తక్కువ ధరలు ఉంటే రైతు (Farmer) అనేవాడు ఎలా బతకాలని ప్రభుత్వాన్ని ప్రశ్నించాడు. వివరాల్లోకి వెళితే.. అన్నమయ్య (Annamayya) జిల్లా పెండూరివారిపల్లెకు (Penduruvaripalle) చెందిన రైతు మల్లప్ప (Farmer Mallappa) టమాటా (Tomato) సాగు చేశారు. తన రెండు ఎకరాల భూమిలో శ్రమించి సాగు చేసిన టమాటాకు అధిక ధర వస్తుందనే ఆశతో మదనపల్లె మార్కెట్‌కు చేరుకున్నారు. కానీ, అక్కడ ఎదురైన ధరలు ఆయన ఆశలను నీరుగార్చాయి. ఆవేదనతో మల్లప్ప తన పంటను రోడ్డుపక్కన పారబోసుకున్నాడు.
నిరాశతో తిరిగొచ్చిన మల్లప్ప
గత వారం రోజులుగా మదనపల్లె మార్కెట్‌లో టమాటా ధరలు కొంత పెరిగినట్లు సమాచారం అందడంతో, లాభం ఆశించి 190 టమాటా పెట్టెలను (ప్రతి పెట్టె 30 కిలోలు) మార్కెట్‌కు తరలించారు. అయితే, మదనపల్లె మార్కెట్‌లో ఎదురైన వాస్తవం ఆయనను షాక్‌కు గురిచేసింది. 30 కిలోల టమాటా పెట్టెకు కేవలం రూ.30 నుంచి రూ.50 మాత్రమే పలుకుతుండడంతో ధరలతో అమ్మితే తీవ్ర నష్టం ఖాయమని గ్రహించిన మల్లప్ప, తన కష్టాన్ని రోడ్డుపై పారబోస్తూ ఆవేదన వ్యక్తం చేశారు.
“మేము రాత్రింబవళ్లు కష్టపడి పండించిన పంటకు ఇంత తక్కువ ధర లభిస్తే, ఎలా బతకాలి? సాగు ఖర్చులు, రవాణా ఖర్చులు కూడా రావడం లేదు” అని మల్లప్ప వాపోయారు. తన లాంటి రైతులు ఎదుర్కొంటున్న ఈ దుస్థితికి ప్రభుత్వం బాధ్యత వహిస్తుందా..? అని ప్రశ్నించారు. ప్రభుత్వం కనీసం మద్దతు ధర కల్పించాలని డిమాండ్ చేశాడు రైతు మల్లప్ప. పండించిన పంటలను రోడ్డుపై పారబోసిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
కిలో టమాటా రూపాయి.. పంటను రోడ్డున పడేసిన అన్నమయ్య జిల్లా పెండూరివారిపల్లెకు చెందిన రైతు మల్లప్ప#AndhraPradesh pic.twitter.com/6PE78XucBU
— Telugu Feed (@Telugufeedsite) May 15, 2025