రిలయన్స్ గ్రూప్ ఛైర్మన్ అనిల్ అంబానీ మంగళవారం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)(ED) ఎదుట విచారణకు హాజరయ్యారు. రూ. 17,000 కోట్ల బ్యాంక్ లోన్ మోసం కేసుతో సంబంధం ఉన్న మనీలాండరింగ్ ఆరోపణలపై ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ (పీఎంఎల్ఎ) కింద ఆయన వాంగ్మూలం నమోదు చేయనున్నారు. ఈ కేసులో ఆయన విదేశాలకు పారిపోయే అవకాశం ఉందన్న అనుమానంతో ఈడీ ఆగస్టు 1న లుకౌట్ సర్క్యులర్ (ఎల్ఓసీ) జారీ చేసింది.
జులై 24 నుంచి మూడు రోజుల పాటు అనిల్ అంబానీ గ్రూప్‌కు చెందిన 35 ప్రాంగణాలు, 50 కంపెనీలు, 25 మంది వ్యక్తులపై ఈడీ నిర్వహించిన సోదాల తర్వాత ఈ విచారణ జరుగుతోంది. రిలయన్స్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, రిలయన్స్ కమ్యూనికేషన్స్ వంటి కంపెనీలు లోన్‌లను దుర్వినియోగం చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి.
ఈ కేసు 2020లో యస్ బ్యాంక్ మాజీ ప్రమోటర్ రాణా కపూర్‌తో అనిల్ అంబానీ గ్రూప్ కంపెనీలకు సంబంధించిన రూ. 12,800 కోట్ల లోన్ మోసం ఆరోపణలతో మొదలైంది. ఈడీ సోదాల్లో షెల్ కంపెనీల ద్వారా నిధుల మళ్లింపు, నకిలీ బ్యాంక్ గ్యారెంటీలు, లోన్ ఎవర్‌గ్రీనింగ్ వంటి ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి. రిలయన్స్ కమ్యూనికేషన్స్‌పై స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) మోసంగా వర్గీకరించిన రూ. 14,000 కోట్ల డిఫాల్ట్, కెనరా బ్యాంక్‌తో రూ.1,050 కోట్ల మోసం కేసులు కూడా ఈడీ స్కానర్‌లో ఉన్నాయి. ఈ విచారణలో బీస్వాల్ ట్రేడ్‌లింక్ ఎండీ పార్థ సారథి బీస్వాల్‌ను ఆగస్టు 1న అరెస్టు చేయడం ఈ కేసులో తొలి అరెస్టు.








