విశాఖ (Visakha)లోని సుప్రసిద్ధ ఆంధ్రా యూనివర్శిటీ (Andhra University) ఇటీవల సంచలనాలకు కేరాఫ్‌గా నిలుస్తోంది. తాజాగా వర్సిటీలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఏడాది కాలంగా ఏయూ రిజిస్ట్రార్ (AU Registrar)గా సేవలందించిన ప్రొఫెసర్ (Professor) ధనుంజయరావు (Dhanunjaya Rao) తన బాధ్యతల నుంచి తప్పుకున్నారు. రిజిస్ట్రార్ పదవికి రాజీనామా (Resignation) చేశారు.
ఏయూ వైస్ చాన్స్‌లర్ (AU Vice Chancellor) వైఖరి (Attitude) కారణంగానే ఈ అనూహ్య నిర్ణయం తీసుకున్నారని విశ్వసనీయ వర్గాల సమాచారం. గత కొంతకాలంగా ఏయూలో అస్తవ్యస్త పాలన కొనసాగుతుండటం, అధికార పోరు పెరగడం వల్ల సమస్యలు అధికమయ్యాయని ఆరోపణలు వినిపిస్తున్నాయి.
ఇక, తెలుగుదేశం పార్టీ ఎంపీ, మంత్రి నారా లోకేష్ తోడల్లుడు శ్రీభరత్ సిఫార్సుతో వీసీ నియామకం జరగడం, వందేళ్ల ఉత్సవాలపై వీసీ నిర్లక్ష్యం చూపడం వంటి అంశాలు కూడా తీవ్ర విమర్శలకు దారి తీశాయి. ఈ నేపథ్యంలో రిజిస్ట్రార్ రాజీనామా ఏయూ భవిష్యత్తుపై మరింత చర్చలకు దారి తీస్తోంది. విద్యార్థులు, సిబ్బంది వర్గాల్లో ఈ పరిణామం పెద్ద ఎత్తున చర్చనీయాంశమైంది.