ఐర్లాండ్‌లో రోడ్డు ప్ర‌మాదం.. ఏపీ యువకుడి మృతి

ఐర్లాండ్‌లో రోడ్డు ప్ర‌మాదం.. ఏపీ యువకుడి మృతి

విదేశాల్లో చ‌దువుకుంటున్న‌ మరో తెలుగు యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. కృష్ణా జిల్లా జగయ్యపేటకు చెందిన చిట్టూరి భార్గవ్ ఉన్నత చదువు, ఉద్యోగ అవకాశాల కోసం ఐర్లాండ్ వెళ్లాడు. చదువు పూర్తి చేసుకుని త్వరలోనే ఉద్యోగంలో చేరాల్సిన భార్గవ్‌కి రోడ్డు ప్ర‌మాదంలో దుర్మ‌ర‌ణం చెందాడు.

వివ‌రాల్లోకి వెళితే.. శుక్రవారం రాత్రి తన స్నేహితులతో కలిసి కారులో భార్గ‌వ్ బయలుదేరాడు. అతను ప్రయాణిస్తున్న వాహనం అదుపుతప్పి ఓ చెట్టును ఢీకొట్టడంతో భార్గవ్ అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటనతో ఆయన కుటుంబం, స్నేహితులు శోకసంద్రంలో మునిగిపోయారు. ఈ ప్ర‌మాదానికి సంబంధించిన పూర్తి వివ‌రాలు ఇంకా తెలియాల్సి ఉంది.

Join WhatsApp

Join Now

Leave a Comment