ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh)లోని శ్రీసత్యసాయి జిల్లా (Sri Sathya Sai District) కుమ్మరవాండ్లపల్లి (Kummaravandlapalli)లో ఒక అమానుష ఘటన వెలుగులోకి వచ్చింది. స్థానికంగా ఉన్న ఒక పెట్రోల్ బంక్‌లో పంప్ బాయ్‌గా పనిచేస్తున్న బాబా ఫకృద్దీన్ అనే యువకుడిని మేనేజర్లు దారుణంగా చిత్రవధకు గురిచేశారు.
వివరాల్లోకి వెళితే.. బాబా ఫకృద్దీన్ (Baba Fakruddin) స్థానికంగా ఉన్న బంక్‌లో పంప్ బాయ్‌గా వర్క్ చేస్తున్నాడు. శనివారం రూ. 24,000 తక్కువగా వచ్చాయన్న ఆరోపణతో బంక్ యాజమాన్యం దాడిపై అతి కిరాతకంగా వ్యవహరించింది. అతడిని బలవంతంగా బట్టలు విప్పించి (Stripped Of Clothes), ఒక ఇనుప స్తంభానికి (Iron Pole) కట్టేసి కిరాతకంగా కొట్టారు. ఈ దారుణ ఘటనను వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది వైరల్‌గా మారింది.
బాధితుడి కుటుంబ సభ్యులు ఈ ఘటన గురించి పోలీసులకు సమాచారం అందించడంతో, కదిరి పోలీసులు వెంటనే స్పందించారు. వారు బాబా ఫకృద్దీన్‌ను విడిపించి, ప్రధాన నిందితుడైన సూర్యనారాయణ (Suryanarayana)పై కేసు నమోదు చేశారు. ప్రస్తుతం ఈ ఘటనపై దర్యాప్తు కొనసాగుతోంది.
ఈ ఘటన పట్ల ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బాధితుడికి న్యాయం జరగాలని, ఇలాంటి దాడులు భవిష్యత్తులో జరగకుండా కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. పెట్రోల్ బంకులు, ఫ్యాక్టరీలు వంటి ప్రైవేటు సంస్థల్లో కార్మికులపై జరుగుతున్న వేధింపులు, దాడులపై ప్రభుత్వం సీరియస్‌గా చర్చించి, కఠిన చట్టాలను అమలు చేయాల్సిన అవసరం ఉందని సామాజిక వేదికలలో చర్చ జరుగుతోంది.