ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం (Andhra Pradesh Government) వివిధ శాఖల్లో పనిచేస్తున్న 31 మంది ఐఏఎస్(IAS) అధికారులను బదిలీ చేస్తూ, కొత్త నియామకాలను చేపట్టింది. ఈ మేరకు సాధారణ పరిపాలన శాఖ (GAD) ప్రిన్సిపల్ సెక్రటరీ ముఖేష్ కుమార్ మీనా (Mukesh Kumar Meena) ఉత్తర్వులు జారీ చేశారు. తాజాగా జారీ చేసిన ఈ ఉత్తర్వుల ప్రకారం, కీలకమైన అధికారుల నియామకాలు, అదనపు బాధ్యతలు పొందిన ప్రముఖులు వీరు:
ముఖ్య అధికారుల నియామకాలు
కేవీఎన్ చక్రధర్ బాబు – సెకండరీ హెల్త్ డిపార్ట్‌మెంట్ డైరెక్టర్‌గా నియమితులయ్యారు.
మనజీర్ జిలానీ సమూన్ – వ్యవసాయశాఖ డైరెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించారు.
పి. రవిసుభాష్ – ఏపీ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (APPSC) సెక్రటరీగా నియమితులయ్యారు.
పబ్లిక్ కంపెనీలు & కార్పొరేషన్లలో నియామకాలు
లోతేటి శివశంకర్ – APSPDCL ఛైర్మన్ & ఎండీగా నియమితులయ్యారు.
ఎస్. ఢిల్లీ రావు – ఏపీ స్టేట్ సివిల్ సప్లైస్ కార్పొరేషన్ వైస్ ఛైర్మన్ & మేనేజింగ్ డైరెక్టర్‌గా నియమితులయ్యారు.
పి. అరుణ్ బాబు – ఏపీ స్టేట్ హౌసింగ్ కార్పొరేషన్ వీసీ & ఎండీగా బాధ్యతలు చేపట్టారు.
బి. నవ్య – ఏపీ స్టేట్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్ వీసీ & ఎండీగా నియమితులయ్యారు.
సి.వి. ప్రవీణ్ ఆదిత్య – APADCL ఎండీగా నియమితులయ్యారు.
ఇతర కీలక బదిలీలు
పి. రంజిత్ భాషా – ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ డైరెక్టర్‌గా, అదనంగా పాఠశాల మౌళిక సదుపాయాల కమిషనర్‌గా పూర్తి బాధ్యతలు స్వీకరించారు.
జె.వి. మురళి – అడిషనల్ చీఫ్ కమీషనర్ ఆఫ్ ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ (CCLA) కమ్ సెక్రటరీగా నియమితులయ్యారు.
టి.ఎస్. చేతన్ – CCLA జాయింట్ సెక్రటరీగా బాధ్యతలు స్వీకరించారు.
కె.ఎస్. విశ్వనాథ్ – సమాచార మరియు పౌర సంబంధాల శాఖకు, ఎక్స్ అఫీషియో డిప్యూటీ సెక్రటరీ జనరల్ అడ్మినిస్ట్రేషన్‌గా నియమితులయ్యారు.
ఆర్. గోవిందరావు – సివిల్ సప్లైస్ & వినియోగదారుల వ్యవహారాలు విభాగానికి బదిలీ అయ్యారు.
ఎస్. చిన్న రాముడు – ఏపీ స్టేట్ కమిషన్ ఫర్ షెడ్యూల్ క్యాస్ట్ సెక్రటరీగా నియమితులయ్యారు.
జి సూర్యసాయి ప్రవీణ్ చంద్ – జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ ఏపీ ట్రాన్స్ కోకు బదిలీ అయ్యారు.
భావనా ఐఏఎస్ – బాపట్ల జాయింట్ కలెక్టర్, అడిషనల్ డిస్ట్రిక్ట్ మేజిస్ట్రేట్‌గా నియమితులయ్యారు.
సి విష్ణు చేతన్ – సోషల్ వెల్ఫేర్ డిపార్టుమెంట్ ప్రభుత్వ డిప్యూటీ సెక్రటరీగా బాధ్యతలు చేపట్టారు.
ఎస్ఎస్ సోబికా – వైద్యారోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ డిప్యూటీ సెక్రటరీగా నియమితులయ్యారు.
అభిషేక్ కుమార్ – ఏపీ మారిటైమ్ బోర్డు సీఈఓగా, అలాగే ఏపీ మారిటైమ్ బోర్డు ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్‌కు సంబంధించి పూర్తి అదనపు బాధ్యతలు చేపట్టనున్నారు.







