ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh)లో కరోనా (Corona) మళ్లీ తన ప్రభావాన్ని చూపిస్తోంది. ప్రజలను ఆందోళనకు గురిచేస్తోంది. తాజాగా గుంటూరు జిల్లా తాడేపల్లి (Tadepalli) లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రి (Private Hospital)లో నిర్వహించిన కోవిడ్ పరీక్షల్లో ముగ్గురికి (Three People) పాజిటివ్ (Positive)గా నిర్ధారణ అయినట్లుగా తెలుస్తోంది. ఈ ముగ్గురిలో ఏలూరు (Eluru)కు చెందిన ఒక భార్యాభర్తలు, తెనాలి (Tenali)కి చెందిన 83 ఏళ్ల వృద్ధుడు ఉన్నారు. అధికారిక సమాచారం మేరకు, ఈ ముగ్గురు ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.
ఐసీయూలో వృద్ధుడికి చికిత్స..
తెనాలి వృద్ధుని (Elderly Man) ఆరోగ్య పరిస్థితి (Health Condition) విషమంగా (Critical) ఉందని వైద్యులు తెలిపారు. అతనికి తీవ్రమైన శ్వాసకోశ సమస్యలు ఏర్పడటంతో ఐసీయూలో ప్రత్యేక వైద్యం అందిస్తున్నారు. భార్యాభర్తల ఆరోగ్యం ప్రస్తుతం స్థిరంగా ఉన్నప్పటికీ, ముందు జాగ్రత్తగా వారిని కూడా ప్రత్యేక వార్డులో ఉంచి చికిత్స అందిస్తున్నారు. వైరస్ మరింత వ్యాపించకుండా చర్యలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.
రాష్ట్రంలో మొత్తం కేసులు ఐదు
ఇప్పటికే రాష్ట్రంలో ఇద్దరికి కరోనా పాజిటివ్‌గా తేలగా, ఈ కొత్త మూడు కేసులతో కలిపి మొత్తం కేసుల సంఖ్య ఐదుకు చేరుకుంది. ఇక దేశవ్యాప్తంగా కరోనా కేసులు వేగంగా పెరుగుతున్నాయి. కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించిన సమాచారం ప్రకారం, దేశంలో కరోనా బాధితుల సంఖ్య ఇప్పటికే వెయ్యిని దాటింది. అధికారులు ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నారు. అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దని, భౌతిక దూరం పాటించాలని, మాస్కులు తప్పనిసరిగా ధరించాలని సూచిస్తున్నారు. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని కోరుతున్నారు.








