ఏపీలో బర్డ్ ఫ్లూ కలకలం.. రెండేళ్ల చిన్నారి మృతి

ఏపీలో బర్డ్ ఫ్లూ కలకలం.. రెండేళ్ల చిన్నారి మృతి

ఆంధ్రప్రదేశ్‌ (Andhra Pradesh) లో బర్డ్ ఫ్లూ (Bird Flu) కారణంగా తొలి మరణం నమోదైంది. పల్నాడు జిల్లా నరసరావుపేట (Narasaraopet) లో రెండేళ్ల చిన్నారి (Two-Year-Old Child) ఈ వైరస్ బారినపడి ప్రాణాలు కోల్పోయింది. అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం.. చిన్నారి పచ్చి కోడి మాంసం (Raw Chicken Meat) తినడం వల్ల ఈ ప్రమాదం జరిగింది. మార్చి 16న చిన్నారి మృతి (Death) చెందగా, అనుమానాస్పద స్థితిలో నమూనాలను సేకరించి పలు పరీక్షలు నిర్వహించారు. చివరికి, అధికారికంగా బర్డ్ ఫ్లూ కారణంగా చిన్నారి మృతిచెందినట్లు ధృవీకరించారు.

చిన్నారి తల్లిని విచారించగా, “కోడి కూర కోస్తుండగా పాప అడిగింది, ఒక్క ముక్క ఇచ్చాను. తిన్న తర్వాత అనారోగ్యం వచ్చింది” అని తెలిపారు. ఈ ఘటనతో ప్రజల్లో భయాందోళనలు పెరుగుతున్నాయి. ప్రభుత్వం తగిన జాగ్రత్తలు తీసుకుంటుందని అధికారులు వెల్లడించారు.

Join WhatsApp

Join Now

Leave a Comment