ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు, పబ్లిక్ పాలసీలపై తనదైన శైలిలో విశ్లేషణలు ఇస్తూ అందరినీ ఆకట్టుకుంటున్న ఆంధ్రపాడ్‌క్యాస్టర్
విజయ్ కేసరిని కొందరు టార్గెట్ చేశారు. పాడ్‌క్యాస్టర్‌గా తన వీడియోలకు అనూహ్య స్పందన వస్తుండటంతో తెలుగుదేశం పార్టీ అతన్ని వేధిస్తోందని, తనను, తన సతీమణిపై దుష్ప్రచారం మొదలుపెట్టారని ఆయన తాజాగా ఓ విడుదల చేశారు.
కొన్ని వారాల నుంచి తనను, తన ఫ్యామిలీని టీడీపీ టార్గెట్ చేసిందని, సోషల్ మీడియా వేదికగా విపరీతంగా వేధిస్తున్నారని చెప్పారు. ట్రోలింగ్ స్టేట్ కల్చర్‌లో పార్ట్‌గా భావించి వదిలేశానని, కానీ, తన విషయంలో ఎప్పుడూ జరగని విధంగా టీడీపీ నేతలు దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.
TDP Vaallu Na Family Ni Harass Chesthunnaru | Andhra Podcaster | Vijay Kesari
— Vijay Kesari (@AndhraPodcaster) January 24, 2025
Link to the https://t.co/A5Hd1Awf4t
Please put any questions you have in the comments section below this post and thanks for your interest in the development of Andhra.
– Vijay#andhrapodcaster… pic.twitter.com/DSJLNVWhWq
`రేణుక జెట్టి అనే టీడీపీ నాయకురాలు నాపై, నా భార్యపై అసభ్యకర వ్యాఖ్యలు చేస్తోంది. కొన్ని బహిరంగంగా చదవడానికి కూడా వీళ్లేని భాషలో రాసింది. ఎలాంటి ఆధారాలు లేకుండా ఫేక్ న్యూస్, తప్పుడు ఆరోపణలను క్రియేట్ చేసి తనను, తన వైఫ్‌ని నీచంగా తిడుతూ పోస్టులు క్రియేట్ చేయిస్తుంది. సోషల్ మీడియాలో సర్క్యులేట్ చేయిస్తోంది.
ఆంధ్రపాడక్యాస్టర్ ఛానల్‌ను జూన్ 2023లో స్టార్ట్ చేశాను. జగన్ రూలింగ్‌లో ఉన్న సమయంలోనే ఆయన్ను క్వశ్చన్స్ చేస్తూ చాలా ఎపిసోడ్స్ చేశాను. కావాలంటే వెనక్కి వెళ్లి చూసుకోవచ్చు. కానీ, వైసీపీ నుంచి ఎప్పుడూ ఇలాంటి ఘటనలు ఎదురుకాలేదు. నా విమర్శలను వారు స్వీకరించారు. ఏరోజూ నా పనికి అడ్డుపడలేదు, నా ఫ్యామిలీపై నీచంగా మాట్లాడలేదు.
రేణుక జెట్టి అనే టీడీపీ నాయకురాలు ఎల్ఎల్‌బీ చదువుకున్నారు. ఆవిడ ఒక మహిళ అయ్యుండి.. ఎలాంటి ఆధారాలు లేకుండా, వెరిఫికేషన్ చేసుకోకుండా తోటి మహిళపై నీచమైన ఆరోపణలు ఎలా చేస్తారు..? మీకు ఎథిక్స్ అనేవి ఉండవా..?` అని విజయ్ కేసరి ప్రశ్నించారు. ప్రస్తుతం ఆయన విడుదల చేసిన వీడియో వైరల్‌గా మారగా, బరాబర్ నీకు సపోర్టు చేస్తామని కొందరు విజయ్‌కి మద్దతుగా పోస్టులు పెడుతున్నారు.