యాంకర్ లోబోకు ఏడాది జైలు శిక్ష

యాంకర్ లోబోకు ఏడాది జైలు శిక్ష

ప్రసిద్ధ టెలివిజన్ యాంకర్, బిగ్ బాస్ ఫేమ్‌ లోబో (Lobo) అలియాస్ (Alias) మహమ్మద్ ఖయ్యూం (Mohammed Khayyum)కు జనగామ కోర్టు (Jangaon Court) ఒక సంవత్సరం(Year) జైలు శిక్ష (Jail Punishment )తో పాటు రూ.12,500 జరిమానా విధించింది. 2018లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో నిర్లక్ష్యంగా డ్రైవ్‌ చేయడం వల్ల ఇద్దరు ప్రాణాలు కోల్పోయిన ఘటనపై కోర్టు ఈ తీర్పు వెలువరించింది.

2018లో ప్రమాదం
2018లో లోబో తన కారు నడుపుకుంటూ హైదరాబాద్ (Hyderabad) వైపు వస్తున్నాడు. ఈ క్రమంలో జనగామ జిల్లా నిడిగొండ వద్ద ఒక ఆటోను ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో ఆటోలో ఉన్న మేడె కుమార్, పెంబర్తి మణెమ్మ అనే ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. కారు బోల్తా పడటంతో లోబోతో పాటు అతనితో ఉన్న మరికొందరు గాయపడ్డారు.

కేసు విచారణ
ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అనేక సాక్ష్యాధారాలు, సాక్షుల వాంగ్మూలాలు పరిశీలించిన అనంతరం కేసు కోర్టులో నడిచింది. లోబో నిర్లక్ష్య డ్రైవింగ్ కారణంగానే ఈ ప్రాణనష్టం జరిగిందని కోర్టు తేల్చింది. సుదీర్ఘకాల విచారణ అనంతరం, జనగామ కోర్టు లోబోకు ఒక సంవత్సరం జైలు శిక్షతో పాటు రూ.12,500 జరిమానా విధిస్తూ తీర్పు వెలువరించింది.

Join WhatsApp

Join Now

Leave a Comment