మూడు సంవత్సరాల క్రితం ఒక టెలివిజన్ షోలో జరిగిన సంఘటనపై ప్రముఖ నటి రాశీ (Raasi) కి యాంకర్ అనసూయ (Anasuya) బహిరంగ క్షమాపణలు (Public Apology) తెలిపారు. అప్పట్లో రూపొందించిన ఒక స్క్రిప్ట్‌లో, తన నోటితో అనుకోకుండా డబుల్ మీనింగ్ డైలాగ్ చెప్పించారని, అందులో మీ పేరు ఉపయోగించబడటం తన పెద్ద తప్పేనని ఆమె స్పష్టంగా అంగీకరించారు. ఆ రోజు ఆ పరిస్థితిని ప్రశ్నించే శక్తి తనకు లేదని, కానీ అది తప్పేనని ఇప్పటికీ బాధతో ఒప్పుకుంటున్నాను అని, “వెనక్కి వెళ్లి సరిదిద్దుకోలేనప్పటికీ, నా బాధ్యతగా హృదయపూర్వక క్షమాపణలు చెబుతున్నాను” అంటూ వినమ్రతతో అనసూయ ఎక్స్ లో స్పందించారు.
కాలక్రమంలో మనుషులు మారతారని, తాను కూడా మారానని చెప్పిన ఆమె, ఆ షోలో ద్వంద్వార్థపు మాటలను ఖండించడం నుంచి ఆ కార్యక్రమాన్ని పూర్తిగా విడిచిపెట్టే వరకు తన మార్పు స్పష్టంగా కనిపిస్తుందని అన్నారు. ఈరోజు మహిళల భద్రతపై గట్టిగా మాట్లాడుతున్న తనపై, నన్ను ఏదో చెయ్యాలనే దీనిలో భాగంగా అప్పటి మాటలను తీసుకొచ్చి హేట్ క్యాంపెయిన్ నడపడం బాధాకరమని పేర్కొన్నారు. ఆ కథనాలు మీకు(RAASI) గారికి ఎంత ఇబ్బంది కలిగిస్తాయో తాను అర్థం చేసుకోగలనని, దర్శక–రచయిత–నిర్మాతలు క్షమాపణ చెప్పినా చెప్పకపోయినా, తన తప్పును తానే స్వీకరిస్తూ మరోసారి బహిరంగంగా క్షమాపణలు కోరుతున్నానని అనసూయ తెలిపారు.








