“చెప్పు తెగుద్ది”! అనసూయ వార్నింగ్‌ వీడియో వైరల్

"చెప్పు తెగుద్ది"! అనసూయ వార్నింగ్‌ వీడియో వైరల్

టాలీవుడ్ నటి, ప్రముఖ‌ యాంకర్ అనసూయ భరద్వాజ మరోసారి వార్తల్లోకెక్కారు. అన‌సూయ తన అభిమానుల‌పై మండిప‌డిన వీడియో ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. ఆంధ్రప్రదేశ్‌ ప్రకాశం జిల్లా మార్కాపురంలో ఓ షాపింగ్ మాల్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన అనసూయ అక్కడ జరిగిన అసభ్య ఘటనపై తీవ్రంగా స్పందించారు. ఈ ఈవెంట్ సందర్భంగా కొంతమంది యువకులు అసభ్యంగా ప్రవర్తించడాన్ని గమనించిన అనసూయ, వారికి దీటైన స‌మాధానం ఇచ్చింది.

అసభ్యంగా ప్రవర్తించిన యువకులపై అనసూయ తీవ్రంగా మండిపడ్డారు. “చెప్పు తెగుద్ది! “మీ ఇంట్లో అమ్మ, చెల్లెలు, భార్య ఉంటే ఇలాగే మాట్లాడతారా? పెద్దవాళ్లకు మర్యాద ఇవ్వడం మీ ఇంట్లో నేర్పలేదా?” అంటూ బహిరంగంగానే ఆ యువకులను మందలించారు. ఆమె ధైర్యంగా, నిస్సంకోచంగా ప్రవర్తించిన తీరు అక్కడ ఉన్న ప్రతి ఒక్కరిని ఆశ్చర్యానికి గురిచేసింది.

వీడియో వైరల్ – నెటిజన్ల మద్దతు వెల్లువ
ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. అనసూయ స్పందనపై నెటిజన్ల నుంచి మద్దతు వెల్లువెత్తుతోంది. “ఇలా స్పందించడం తగిన సమాధానం, మహిళల భద్రత కోసం ఎవరైనా ఈ విధంగా ఎదురు నిలవాలి” అంటూ అనేకమంది సోషల్ మీడియా వేదికగా అనసూయకు అభినందనలు తెలుపుతున్నారు. మహిళల పట్ల సమాజంలో మారుతుంటున్న వ్యవహారశైలిపై ప్రశ్నలు లేవనెత్తిన అనసూయ ధైర్యానికి ప్రశంసల జల్లు కురుస్తోంది.

Join WhatsApp

Join Now

Leave a Comment