సోషల్ మీడియా (Social Media)లో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే సెలబ్రిటీలలో యాంకర్ అనసూయ భరద్వాజ్ (Anasuya Bharadwaj) ముందుంటారు. తాజాగా తన డ్రెస్సింగ్ స్టైల్‌పై వస్తున్న ట్రోల్స్ (Trolls)పై ఆమె ఇన్స్టాగ్రామ్ (Instagram)లో ఘాటుగా స్పందించారు. ఇద్దరు పిల్లల తల్లి అయినంత మాత్రాన తన వ్యక్తిత్వాన్ని, అభిరుచులను కోల్పోకూడదని ఆమె అన్నారు.
యాంకర్ అనసూయ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. బుల్లితెరపై కెరీర్ ప్రారంభించి, ఇప్పుడు సినీ రంగంలో బిజీ నటిగా మారిపోయారు. రంగస్థలం సినిమాతో నటిగా ప్రశంసలు అందుకున్న అనసూయ, ఆ తర్వాత టాలీవుడ్లో బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో అలరిస్తున్నారు. అయితే, సోషల్ మీడియాలో మాత్రం నిత్యం ఏదో ఒక విషయంతో వార్తల్లో నిలుస్తుంటారు. ముఖ్యంగా ఆమె డ్రెస్సింగ్ స్టైల్‌పై ఎక్కువగా ట్రోల్స్ వస్తుంటాయి. ఇద్దరు పిల్లల తల్లి అయినప్పటికీ గ్లామరస్ డ్రెస్‌లు వేసుకోవడం ఏంటని కొందరు ఆమెను విమర్శిస్తుంటారు.
తాజాగా తనపై వస్తున్న ఈ ట్రోల్స్‌పై అనసూయ సుదీర్ఘ పోస్ట్ చేశారు. “తల్లి అయ్యాక మనల్ని మనం వదిలేసుకోవాలా?” అని ప్రశ్నిస్తూ, ఓపెన్ లెటర్‌ను షేర్ చేశారు. నచ్చినట్లు డ్రెస్ వేసుకుంటే బోల్డ్‌గా ఉన్నట్లు కాదు, అలా ఉంటే విలువలు కోల్పోయినట్లా? అని ప్రశ్నిస్తూ, తన వ్యక్తిగత స్వేచ్ఛను, ఎంపికలను గౌరవించాలని ఆమె స్పష్టం చేశారు. ఈ పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది.