అనంత కలెక్టరేట్ వద్ద ఉద్రిక్తత.. ఆర్డీటీ కోసం పొలికేక‌

అనంత కలెక్టరేట్ వద్ద ఉద్రిక్తత.. ఆర్డీటీ కోసం పొలికేక‌

అనంతపురం జిల్లాలో ఎంతోమంది జీవితాల‌కు బాస‌ట‌గా నిలిచిన‌ రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్‌ (ఆర్డీటీ) సంస్థ‌కు మద్దతుగా ఆందోళనలు ఉధృతమయ్యాయి. కలెక్టరేట్ వద్ద ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు చెందిన ఆర్డీటీ లబ్దిదారులు, సంఘాల జేఏసీ నేతృత్వంలో నిరసనలు చేపట్టారు. ఆర్ట్స్‌ కళాశాల నుంచి ర్యాలీగా బయలుదేరిన ఆందోళనకారులు కలెక్టర్‌ కార్యాలయాన్ని ముట్టడించారు. బారికేడ్లు తొసేస్తూ కలెక్టరేట్‌లోకి చొరబడ్డ “సేవ్‌ ఆర్డీటీ” నినాదాలతో ఉద్రిక్తత సృష్టించారు.

కలెక్టరేట్‌ లోని రెవెన్యూ భవన్‌ వద్ద జాయింట్‌ కలెక్టర్‌, జిల్లా అధికారులతో దళిత సంఘాల నేతల వాగ్వాదం చోటుచేసుకుంది. భవనానికి తాళాలు వేసే ప్రయత్నం కూడా జరిగింది. ఆర్డీటీకి కేంద్ర ప్రభుత్వం విదేశీ నిధుల అనుమతులు రద్దు చేస్తుండగా, ముఖ్యమంత్రి చంద్రబాబు మౌనం ఎందుకని లబ్ధిదారులు ప్రశ్నించారు.

చంద్రబాబు, పవన్‌ కళ్యాణ్‌, నారా లోకేష్‌లకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ నిరసనకారులు మండిపడ్డారు. ఆర్డీటీ అనేది ఎన్నేళ్లుగా జిల్లాలో నిస్వార్థంగా సేవలు అందిస్తున్న సంస్థ అని, దాని నిధులను నిలిపివేయడం అన్యాయమని వారు ఆవేదన వ్యక్తం చేశారు. నిరసనలతో అనంతపురం కలెక్టరేట్‌ పరిసరాల్లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

Join WhatsApp

Join Now

Leave a Comment