మినీ మహానాడులో విషాదం.. టీడీపీ కార్యకర్త ఆత్మహత్యాయత్నం

మినీ మహానాడులో విషాదం.. టీడీపీ కార్యకర్త ఆత్మహత్యాయత్నం

అనంతపురం కమ్మ భవన్‌ (Anantapur Kamma Bhavan) లో నిర్వహించిన తెలుగుదేశం పార్టీ (TDP) మినీ మహానాడు (Mini Mahanadu) సమావేశంలో ఒక దుర్ఘటన చోటు చేసుకుంది. పార్టీలో తనకు అన్యాయం జరిగిందని ఆవేదన వ్యక్తం చేస్తూ టీడీపీ కార్యకర్త వెంకటేష్ (Venkatesh) పురుగుల మందు (Pesticide) తాగి ఆత్మ‌హ‌త్య‌కు (Suicide) య‌త్నించిన సంఘ‌ట‌న సంచ‌ల‌నంగా మారింది. మినీ మ‌హానాడులో టీడీపీ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ (Daggupati Prasad) ఎదుటే ఈ సంఘ‌ట‌న జ‌ర‌గ‌డం చ‌ర్చ‌నీయాంశంగా మారింది.

ఘటన వివరాలు
అనంత‌పురంలో క‌మ్మ‌భ‌వ‌న్‌లో మినీ మహానాడు సమావేశంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సమావేశంలో భాగంగా ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగిస్తున్న సమయంలో టీడీపీ కార్య‌క‌ర్త వెంకటేష్ అకస్మాత్తుగా లేచి నిలబడి, తనకు పార్టీలో జరిగిన అన్యాయం జ‌రిగింద‌ని కేక‌లు వేస్తూ.. “నేను ఎన్నో ఏళ్లుగా పార్టీ కోసం కష్టపడ్డాను, కానీ నాకు ఎలాంటి గుర్తింపు లేదు, న్యాయం జరగలేదు” అని ఆవేదన వ్యక్తం చేస్తూ అందరూ చూస్తుండగానే పురుగుల మందు తాగాడు. వేదిక వ‌ద్ద కుప్ప‌కూలాడు. నుర‌గ‌లు క‌క్కుతున్న వెంక‌టేష్‌ను వెంట‌నే స్థానిక ఆస్ప‌త్రికి త‌ర‌లించారు.

సోషల్ మీడియాలో చర్చ
వెంక‌టేష్ ఆత్మ‌హ‌త్యాయ‌త్నం వీడియోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారాయి. కార్య‌క‌ర్త‌ల పార్టీ అని చెప్పుకోవ‌డ‌మేనా.. కార్య‌క‌ర్త‌ల‌కు ఏమైనా న్యాయం చేసేది ఉందా..? అని నెటిజ‌న్లు ప్ర‌శ్నిస్తున్నారు. ప‌లువురు టీడీపీ కార్య‌క‌ర్త‌లు వెంక‌టేష్ త్వ‌ర‌గా కోలుకోవాల‌ని కామెంట్లు పెడుతున్నారు. వెంకటేష్‌కు జ‌రిగిన అన్యాయంపై టీడీపీ అగ్ర‌నాయకత్వం సీరియస్‌గా స్పందించాలని ఆ పార్టీ త‌ర‌ఫున డిమాండ్లు వినిపిస్తున్నాయి.

Join WhatsApp

Join Now

Leave a Comment