అనంతపురం (Anantapur) నగరంలో అమానుష ఘటన (Inhuman Incident) చోటుచేసుకుంది. అప్పుడే పుట్టిన ఆడబిడ్డను (Newborn Baby Girl) రోడ్డు (Road) మీద వదిలివెళ్లిపోయారు కసాయి తల్లిదండ్రులు (Cruel Parents). ఏడుపు విని శిశువును చేరదీసిన స్థానికులు, పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఈ అమానవీయ ఘటన అనంతపురం నగరం విజయనగరం కాలనీ (Vijayanagaram Colony, Anantapur) లో జరిగింది. నవమాసాలు మోసిన తల్లి.. పుట్టింది ఆడబిడ్డ అని తెలిసి వదిలివెళ్లిన సంఘటన స్థానికులకు ఆగ్రహం తెప్పిస్తోంది.
స్థానికులు, పోలీసుల సమాచారం మేరకు విజయనగరం కాలనీకి చేరుకున్న ఐసీడీఎస్ అధికారులు (ICDS Officials) ఆడబిడ్డను తమ చేతుల్లోకి తీసుకున్నారు. శిశువు వద్ద తల్లిదండ్రులు రాసిన లేఖ (Letter) స్వాధీనం చేసుకున్నారు. పోషించలేక తమ ఆడబిడ్డను వదిలి వెళ్తున్నట్లు ఆ బిడ్డ తల్లి నోట్ రాసింది. ”నా కూతురిని నేను పోషించలేను. మీరే నా కూతురికి ఒక మంచి జీవితం ఇవ్వాలని కోరుకుంటూ మీ దగ్గర వదిలి వెళ్లిపోతున్నాను. తన జీవితం బాగుండాలి, తనని వారే బాగా చూసుకోవాలి వేడుకుంటున్నాను. నేను చనిపోతున్నా, నా కుతురిని బాగా చూసుకోండి సార్ ప్లీజ్.. ఒక తల్లిగా నా ఆవేదన. పాపకి ఏమి కాని ఓ తల్లి” అంటూ లేఖలో పేర్కొంది. ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు.
బిడ్డను పోషించడం చేతగానప్పుడు నవమాసాలు మోసి కనడం ఎందుకు అని ఆ కసాయి తల్లిదండ్రులపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పాలబుగ్గల పసిబిడ్డను వదిలివెళ్లడానికి మనసు ఎలా వచ్చిందంటూ కొందరు ప్రశ్నిస్తున్నారు. అదే మగబిడ్డ అయితే వదిలివెళ్లేవారా..? అని కొందరు మండిపడుతున్నారు.