భారతదేశం (India) లో అత్యంత విలువైన సంస్థ అయిన రిలయన్స్ ఇండస్ట్రీస్ గ్యాస్, ఇంధన వ్యాపారాలను విజయవంతంగా నడిపిస్తున్న ముఖేష్ అంబానీ (Mukesh Ambani) కుమారుడు అనంత్ అంబానీ (Anant Ambani) ఇటీవల 140 కిలోమీటర్ల పాదయాత్ర (Padayatra) మొదలుపెట్టారు. ఆయన ఈ ప్రయాణాన్ని జామ్‌నగర్ (Jamnagar) నుంచి ద్వారకాధీశ్ ఆలయానికి (Dwarkadhish Temple) వెళ్లడం కోసం మొదలుపెట్టినట్లు తెలుస్తోంది.
ఈ పాదయాత్రకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. 29 ఏళ్ల అనంత్ తన బాడీగార్డులతో కలిసి వేగంగా నడుస్తూ కనిపిస్తున్నారు. ఆయన ప్రతి రోజూ 20 కిలోమీటర్లు నడుచుకుంటూ ఈ ప్రయాణాన్ని కొనసాగిస్తున్నట్లు సమాచారం. శుక్రవారం ఉదయం 3:45 గంటలకు ప్రత్యేక ముహూర్తంలో ఆయన ఈ పాదయాత్ర ప్రారంభించారు.
ముఖ్యంగా, ఆయన రాత్రిపూట నడవడం వల్ల ట్రాఫిక్‌ను నివారించేందుకు, ప్రజలకు అసౌకర్యం కలగకుండా ఉండేందుకు చర్యలు తీసుకున్నట్లు తెలుస్తోంది. అనంత్ ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నా ఈ ప్రయాణాన్ని కొనసాగిస్తున్నారు.
Anant Ambani is walking 140 km from Jamnagar to Dwarkadhish, covering 20 km daily👏🏼
— The Analyzer (News Updates🗞️) (@Indian_Analyzer) March 31, 2025
~ Despite wealth, he stays rooted in faith. Traveling at NIGHT to avoid inconvenience, security is Tight.
When many forget their roots with money, this devotion stands out. A lesson in values. pic.twitter.com/ibJRbrm7my







