అచ్యుతాపురం సెజ్‌లో అగ్నిప్ర‌మాదం

అచ్యుతాపురం సెజ్‌లో అగ్నిప్ర‌మాదం

అనకాపల్లి (Anakapalli) జిల్లా అచ్యుతాపురం సెజ్‌ (Atchutapuram-SEZ)లో ఉన్న ప్లైవుడ్ పరిశ్రమలో (Plywood Industry) మంగ‌ళ‌వారం రాత్రి ఘోర అగ్నిప్రమాదం (Major Fire Accident) చోటుచేసుకుంది. ఒక్కసారిగా మంటలు ఆకాశాన్ని తాకడంతో ఆ ప్రాంతంలో భయాందోళనలు వ్యక్తమయ్యాయి. పరిశ్రమలో దట్టమైన పొగలు అలుముకోవడంతో చుట్టుపక్కల పరిస్థితి గందరగోళంగా మారింది. మంటలు వ్యాపించి ఉన్న సమయంలో ప్లాంట్‌లో ఉన్న ఇద్దరు వ్యక్తులు మంటల్లో చిక్కుకొని తీవ్రంగా గాయపడ్డారు. బాధితులను వెంటనే స్థానిక ఆసుపత్రి (Hospital) కి తరలించినట్టు సమాచారం. ప్రమాదానికి కారణాలు ఇంకా తెలియరాలేదు. ప్రజలు, కార్మికులు భయాందోళనలకు లోనవుతున్న నేపథ్యంలో అధికారులు రంగంలోకి దిగి మంటలను అదుపులోకి తీసుకువచ్చే ప్రయత్నాలు చేపట్టారు.

Join WhatsApp

Join Now

Leave a Comment