15 అడుగుల భారీ స‌ర్పం.. ప‌రుగులు పెట్టించింది

15 అడుగుల భారీ స‌ర్పం.. ప‌రుగులు పెట్టించింది

పాములను చూస్తేనే భయపడే ప్రజలు, 15 అడుగుల భారీ గిరినాగు (King Cobra) ను చూసి హడలిపోయారు. ఈ ఘటన అనకాపల్లి జిల్లా (Anakapalli District) దేవరాపల్లి (Devarapalli) లో చోటుచేసుకుంది. శుక్ర‌వారం సాయంత్రం దేవరాపల్లిలో ఒడ్డు చింతల కల్లా (Oddu Chinthala Kallalu) ల వద్ద తారు రోడ్డు దాటుతున్న భారీ గిరి నాగును కుక్కలు (Dogs) అడ్డుకోవడంతో అది తీవ్రంగా బుసలు కొట్టింది. ఈ దృశ్యం చూసిన రైతులు (Farmers) ఏంట‌ని అటుగా చూసేలోపు.. వారిపైకి పాము దూసుకెళ్లింది. దీంతో ప్ర‌జ‌లు ప్రాణ‌భయంతో పరుగులు తీశారు.

స్నేక్ క్యాచర్ రాకతో ఊపిరి పీల్చుకున్న స్థానికులు
పాము సరుడు తోటలోకి దూరిపోవడంతో, రైతులు దానిని అదుపులో పెట్టేందుకు ప్రయత్నించారు. అయితే, ఆగ్ర‌హంతో గిరినాగు తిరగబడటంతో భయభ్రాంతులు చెందారు. వెంటనే స్నేక్ క్యాచర్‌ (Snake Catcher) కి సమాచారం అందించారు. స్పందించిన స్నేక్ క్యాచర్స్ చాకచక్యంగా పామును పట్టుకున్నారు. దీంతో స్థానికులు (Locals) ఊపిరిపీల్చుకున్నారు. ప్ర‌స్తుతం ఎండ వేడి కారణంగా పాములు జనావాసాల వైపున‌కు వస్తున్నాయి అని ప్రజలు చెబుతున్నారు. ఇలాంటి ఘటనలు మరింత పెరగకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment