2036 ఒలింపిక్స్ (Olympics) క్రీడలకు (Sports) భారత్ (India) ఆతిథ్యమివ్వాలన్న లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం (Central Government) భారీ స్థాయిలో ప్రణాళికలు రూపొందిస్తోంది. ఈ క్రమంలో భారత హోంమంత్రి (Home Minister) అమిత్ షా (Amit Shah) కీలక ప్రకటనలు చేశారు. 21వ ప్రపంచ పోలీస్ మరియు అగ్నిమాపక క్రీడల్లో భారత్ 613 పతకాలు సాధించింది. ఈ విజయం సందర్భంగా అథ్లెట్లను ప్రత్యేకంగా సన్మానించిన అమిత్ షా, “ఇలాంటి ప్రదర్శనలు దేశ గౌరవాన్ని ప్రపంచ స్థాయిలో పెంచుతున్నాయి” అని ప్రశంసించారు.
టాప్ 5లో భారత్ ఉండాలి
2036 ఒలింపిక్స్‌లో పతకాలు సాధించేందుకు భారత అథ్లెట్లు సిద్ధంగా ఉండాలన్నారు. భారత్ పతకాల పట్టికలో టాప్-5లో ఉండాలని ఆకాంక్షించిన అమిత్ షా, ఈ లక్ష్యం సాధించేందుకు ప్రభుత్వం అన్ని విధాలా అథ్లెట్లకు సహకరిస్తుందని చెప్పారు.
3,000 అథ్లెట్లకు ప్రోత్సాహం
ప్రస్తుతం 3,000 మంది అథ్లెట్లకు నెలకు రూ.50,000 చొప్పున ఆర్థిక సహాయం అందిస్తున్నట్లు వెల్లడించారు. క్రీడల పట్ల మోడీ ప్రభుత్వం గత 10 ఏళ్లుగా చూపిన ఆసక్తి ఫలితంగా దేశంలో క్రీడల పరిస్థితి మెరుగైందన్నారు. “గెలుపు అలవాటుగా మారాలి. గెలవాలన్న లక్ష్యంతోనే ప్రణాళికలు రచించాలి. అలా ప్రణాళికాబద్ధంగా శిక్షణ పొందిన వారు విజయవంతం అవుతారు” అని అమిత్ షా తెలిపారు. మోడీ ప్రభుత్వ లక్ష్యం – ప్రతి గ్రామానికి క్రీడల పునాది వుంచడం. ఇందుకోసం వివిధ వయసుల పిల్లలకు శాస్త్రీయ శిక్షణను అందిస్తున్నారు.
2036 ఒలింపిక్స్ బిడ్ – అహ్మదాబాద్ కేంద్రంగా వేదికలు
భారత్ 2036 వేసవి ఒలింపిక్స్‌కు బిడ్ వేయడానికి సిద్ధమవుతోంది. ఇప్పటికే అహ్మదాబాద్ అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ (AUDA)ని కన్సల్టెంట్‌గా నియమించింది. అహ్మదాబాద్, గాంధీనగర్‌లలో 22 ప్రదేశాలను ఒలింపిక్ వేదికలుగా అభివృద్ధి చేసే యోచనలో ఉంది. అహ్మదాబాద్‌లో నిర్మాణంలో ఉన్న సర్దార్ వల్లభాయ్ పటేల్ స్పోర్ట్స్ ఎన్‌క్లేవ్‌లో అనేక బహుళ క్రీడా వేదికలు ఉండబోతున్నాయి. ఇవన్నీ ఒలింపిక్ ప్రమాణాలకు అనుగుణంగా అభివృద్ధి చేయనున్నట్లు అమిత్ షా స్పష్టం చేశారు.







